»   » నిన్న రజనీతో మీటింగ్: నేడు హైదరాబాద్లో ధోనీ, రాజమౌళి కలిసి ఆడియో వేడుకలో...

నిన్న రజనీతో మీటింగ్: నేడు హైదరాబాద్లో ధోనీ, రాజమౌళి కలిసి ఆడియో వేడుకలో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ టీమిండియా క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ జీవిత నేపథ్యంతో ఎమ్మెస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ అనే మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

ఈ రోజు తెలుగు వెర్షన్ ఆడియో వేడుక శనివారం సాయంత్రం జేఆర్ఈ కన్వెన్షన్ హాలులో జరుగనుంది. ఈ వేడుకకు మిండియా వన్డే కెప్టెన్ ధోని చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి ని స్పెషల్ గెస్ట్ గా హాజరవుతున్నాడు.

కాగా... శుక్రవారం సాయంత్రం ఎంఎస్.ధోనీ టీం చెన్నైలో రజనీకాంత్ ను కలిసారు. వీరితో పాటు క్రికెటర్ ధోనీ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ధోనీ తన ఎఫ్.బిలో పోస్టు చేసారు. సినిమా ప్రమోషన్లో భాగంగానే వారు చెన్నై వెళ్లారు. టీంకు క్రికెటర్ సపోర్టు ఉండటంతో మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఒక క్రికెటర్ జీవితంపై సినిమా రావడం... అది అతని రిటైర్మెంటుకు ముందే రిలీజ్ అవ్వడం ఇదే తొలిసారి. ధోని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎక్కడో జార్ఖండ్ రాష్ట్రలో మామూలు మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఇద్ద పెద్ద క్రికెట్ స్టార్ గా ఎదగడం వెనక చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ సినిమాలో చూపించబోతున్నారు.

MS Dhoni: The Untold Story audio launch details

హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీషులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా వేలాది థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

80 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందే మంచి శాటిలైట్ రైట్స్ ని సంపాదించుకుంది. సినిమాను సాధ్య‌మైనంత స‌హ‌జంగా తీసేందుకు కొన్ని రియ‌ల్ లొకేష‌న్ల‌లో చిత్రీక‌రించారు.

English summary
Cricketer Mahendra Singh Dhoni and director SS Rajamouli will launch the music of the Telugu version of Bollywood movie MS Dhoni: The Untold Story at a grand event in Hyderabad on September 24.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu