Just In
- 38 min ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 43 min ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 1 hr ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 2 hrs ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
తిరుపతి అభ్యర్థిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన: వారంలో తేల్చేస్తాం: అసెంబ్లీని ముట్టడిస్తాం
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
క్రికెటర్ ధోనీపై సినిమా... (అఫీషియల్ ట్రైలర్ రిలీజైంది)
ముంబయి: బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా క్రికెటర్ ఎం.ఎస్. ధోని జీవితచరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఎం.ఎస్. ధోని'. ది అన్‌టోల్డ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసారు.
నీరజ్‌పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ పాండే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ధోని భార్య సాక్షి ధోని పాత్రలో కైరా అద్వానీ, యువరాజ్ సింగ్ పాత్రలో హెర్రీ టంగ్రీ, ధోనీ తండ్రి పాన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్, భూమిక, దిశా పటానీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ధోని చిన్న తనం నుండి ఆయన దేశం గర్వించదగ్గ క్రికెటర్ గా ఎదిగే వరకు అతని జీవితంలో చోటు చేసుకున్న అన్ని ముఖ్య సంఘటనలు ఈ సినిమాలో చూపించబోతున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై క్రికెట్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
'ధోనీ' చిత్రంలో సుశాంత్ సింగ్ ధోనీ తొలినాళ్లలో లుక్ తలపించేలా జులపాల జుట్టుతో కనిపించబోతున్నాడు. ధోని మాధిరిగా హెలికాప్టర్ షాట్లు కొడుతూ సినిమాలో కనిపించబోతున్నారు. సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 7వ నెంబర్ గల టీమిండియా జెర్సీ ధరించి కనిపించనున్నాడు. 7 నెంబర్ అనేది ధోనీకి చాలా స్పెషల్. ఎందుకంటే ధోనీ పుట్టిన రోజు 7/7/1981.