»   » తన సినిమా సెట్లో క్రికెటర్ ధోనీ సందడి, రైనా పాత్రలో రామ్ చరణ్!

తన సినిమా సెట్లో క్రికెటర్ ధోనీ సందడి, రైనా పాత్రలో రామ్ చరణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జీవిత కథతో బాలీవుడ్ దర్శకుడు నీరజ్‌ పాండే ఓ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో. ‘ఎంఎస్ ధోని-ది అన్ టోల్డ్ స్టోరీ' అనేది టైటిల్. తాజాగా ఈ సినిమా సెట్ ను ధోని స్వయంగా సందర్శించాడు. ఈ విషయాన్ని ఆ చిత్రంలో ధోనీ తండ్రి పాన్ సింగ్ పాత్రలో నటిస్తున్న అనుపమ్ ఖేర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సినిమా సెట్లోకి ధోని రాకతో యూనిట్ సభ్యులంతా సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. కెమెరా మెన్ లారా, హీరో సుశాంత్ తో కలిసి ధోనీ దిగిన ఫోటోను షేర్ చేసారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ ధోనీ తొలినాళ్లలో లుక్ తలపించేలా జులపాల జుట్టుతో కనిపించబోతున్నాడు. ధోని మాధిరిగా హెలికాప్టర్ షాట్లు కొడుతూ సినిమాలో కనిపించబోతున్నారు. సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 7వ నెంబర్ గల టీమిండియా జెర్సీ ధరించి కనిపించనున్నాడు. 7 నెంబర్ అనేది ధోనీకి చాలా స్పెషల్. ఎందుకంటే ధోనీ పుట్టిన రోజు 7/7/1981.

MS Dhoni visits set of his biopic ‘M S Dhoni-The Untold Story’

రియల్ లైఫ్ లో క్రికెటర్ ధోనీ, సురేష్ రైనా మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. సినిమాలో కూడా దర్శకుడు రైనా పాత్రను కూడా చూపించబోతున్నాడు. రైనా పాత్రలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. ఇక ధోనీ భార్య సాక్షి సింగ్ పాత్రలో కైరా అద్వానీ కనిపంచబోతోంది. విరాట్ కోహ్లి పాత్రలో ఫవాద్ ఖాన్ కనిపిస్తారు. ఈ సినిమాలో జాన్ అబ్రహం, భూమిక, కాదర్ ఖాన్, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ తదితరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు.

వచ్చే ఏడాది నాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటు సినీ ప్రియులతో పాటు, అటు క్రికెట్ అభిమానులు కూడా ఈ చిత్రంపై ఆసక్తి చూపుతారు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఇటీవల క్రీడాకారుల జీవితాలపై తీసిన....‘భాగ్ మిల్ఖా భాగ్', ‘మేరీ కోమ్' లాంటి చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. దేశంలో క్రికెట్ ను అభిమానించే వారి సంఖ్యే ఎక్కువ కాబట్టి ఈ చిత్రానికి భారీ స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

English summary
MS Dhoni visits set of his biopic ‘M S Dhoni-The Untold Story’. "Lara, our camera attendant was happiest 2 meet msdhoni on d sets of biopic on his life. itsSSR is equally happy.:)" Anupam Kher tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu