»   » అవును...ఎమ్మెస్ నారాయణ కుమార్తె సినిమా డైరక్టర్

అవును...ఎమ్మెస్ నారాయణ కుమార్తె సినిమా డైరక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ కుమార్తె శశికిరణ్ దర్శకురాలిగా మారి ఓ చిత్రం డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో కంటిన్యూగా జరుగుతోంది. అంతా కొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని హిందు ఇంగ్లీష్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రావు రమేష్ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో ఆమె సోదరుడు విక్రమ్ సైతం ఓ పాత్రను పోషిస్తున్నారు.

ఈ విషయాన్ని శశికిరణ్ ఖరారు చేస్తూ... అవును...నేను కొన్ని గేమ్ షో లు ఓ తెలుగు టీవి ఛానెల్ కోసం డైరక్ట్ చేసాను. నిర్మాతలు ఈ ఆఫర్ తో ఎప్రోచ్ అయినప్పుడు నేను ఓకే చేసాను...ఖచ్చితంగా చిత్రం మంచి విజయం సాధిస్తుంది అన్నారు. 2012 లో వచ్చిన Thattathin Marayathu అనే మలయాళ మూవిని రీమేక్ చేస్తూ ఆమె దర్శకురాలిగా లాంచ్ అవుతోందని సమాచారం. ఓ ఎన్నారై నిర్మాత ఈ చిత్రం ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఓ సారి దర్శకుడుగా, నిర్మాతగా అవతారం ఎత్తి కొడుకు అని చిత్రం డైరక్ట్ చేసి చేతులు కాల్చుకున్నారు.

 Sasi Kiran

ఎమ్మెస్ నారాయణ తను దర్శకుడుగా ఫెయిల్ అవటం గురించి చెప్తూ... నా ఇమేజ్ వాడికి అడ్డంకి అయ్యింది. నాలాగే వాడూ నవ్విస్తాడనుకున్నారు ప్రేక్షకులు. అందుకే 'కొడుకు' సినిమా వాళ్లని నిరుత్సాహపరిచింది. నాకు ఫైన్ ఆర్ట్స్ తెలుసు కానీ కామర్స్ తెలియదు. నేను చదివింది బీఏ... బీకామ్ కాదు. అందుకని కమర్షియల్ ఎస్టిమేషన్ తెలియలేదు. పెద్దపెద్ద నిర్మాతలే వాళ్ల తనయుల్ని సక్సెస్ చేయలేకపోతున్నారు. నేనెంత? డబ్బుపెట్టి, మంచి సినిమా తీయడం మాత్రమే కాదు.. ఆ సినిమాని కమర్షియల్‌గా వర్కవుట్ చేసుకోవడం కూడా తెలియాలి. మా అబ్బాయి హీరోగా నేను 'కొడుకు' సినిమాని బాగానే తీశాను. నన్నెవరూ తప్పు పట్టలేదు. విక్రమ్‌నీ తప్పు పట్టలేదు. బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా రిలీజ్ చేయడం చేత కాలేదు. పంపిణీ వ్యవస్థ గురించి నాకిప్పటికీ తెలియదు. థియేటర్లో ప్రేక్షకులు కొనుక్కునే టికెట్ డబ్బు నిర్మాతకు ఎలా చేరుతుందో తెలియదు. ఆ మార్గం తెలిసుంటే 'కొడుకు' సేఫ్ ప్రాజెక్టే అన్నారు.

English summary
MS Narayana daughter Sasi Kiran is going to make her debut a director with an untitled project with all new cast. It is a remake of a Malayalam Movie.Film shooting is progressing at brisk pace in Hyderabad. She is making the film with all new cast and crew.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu