»   » ఎమ్మెస్ నారాయణ ఇంట్లో మరో విషాదం

ఎమ్మెస్ నారాయణ ఇంట్లో మరో విషాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకరైన ఎంఎస్ నారాయణ సరిగ్గా ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబం ఇంకా విషాదం నుండి తేరుకోక ముందే మరో విషాదం చోటే చేసుకుంది.

ఎంఎస్ సతీమణి కళాప్రపూర్ణ (63) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంత కాలంగా గుండె సంబంధ వ్యాధితో బాధ పడుతున్న ఆమె సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితమే ఎంఎస్ మొదటి వర్థంతి జరిగింది.

MS Narayana's wife Kalaprapurna passes away

ఎమ్మెస్ బ్రతికున్న సమయంలో తన భార్య గురించి మాట్లాడుతూ...తమది ప్రేమ వివాహం, తన దగ్గరకు ట్యూషన్ కు వచ్చే స్టూడెంట్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెద్దలు మా పెళ్లికి ఒప్పుకోక పోవడంతో తన లెక్చరర్ అయిన పరుచూరి గోపాల క్రిష్ణ తమ పెళ్లి చేసారని, తాను సినిమాల్లోకి రావడానికి తన భార్య ప్రోత్సాహం చాలా ఉందని ఎమ్మెస్ తెలిపారు.

తాను సినిమా అవకాశాల కోసం కష్టపడిన సమయంలో తన భార్య కళాప్రపూర్ణ ఇంటి బాధ్యతలు చూసుకునేది, ఆమె సహాయం లేకుండా నేను ఇంతవాన్ని అయ్యేవాన్ని కాదు అని ఎమ్మెస్ అప్పట్లో అనేవారు.

English summary
Tragedy struck Comedian King MS Narayana's family once again. After MS Narayana's death last year, his wife Kalaprapurna passed away today in the early hours. Kalaprapurna (63) had been suffering from heart disease for a long time and succumbed to it on Monday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu