For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'బాద్‌షా'లో MS.నారాయణ క్యారక్టర్ ఏమిటంటే...

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌షా'. కాజల్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో ఎమ్.ఎస్ నారాయణ పాత్ర హైలెట్ గా నిలవనుందని సమాచారం. ఈ చిత్రంలో ఎమ్.ఎస్.. సినిమా దర్శకుడుగా కనిపించి నవ్వించనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. బ్రహ్మానందం,ఎమ్.ఎస్ నారాయణ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ హైలెట్ అవుతాయంటున్నారు. ఇక ఈ దర్శకుడు పాత్రను అడ్డం పెట్టుకుని ఏ దర్సకుడుపై శ్రీను వైట్ల సెటైర్స్ వేయనున్నారో చూడాలి.

  ఇక గతంలోనూ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎమ్ ఎస్ నారాయణ చేసిన సినిమాల్లో సన్నివేశాలు సూపర్ గా పండాయి. శ్రీను వైట్ల ఆనందం నుంచీ ఎమ్ ఎస్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న దూకుడు లో ఎమ్ ఎస్ నారాయణ...నటుడు అవ్వాలనే ఓ మధ్య వయస్కుడు పాత్రలో..కళ్ళ క్రింద క్యారీ బ్యాగ్ లు గ్రాఫిక్స్ లో తీసేస్తారట కదా అని అమాయకంగా అంటూ నవ్వించారు. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రాజధానిలో షూటింగ్ జరుగుతోంది.

  చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ గురించి శ్రీనువైట్ల చెప్తూ...అతనొక్కడే. కానీ ఓ సైన్యం నడిచొస్తున్నట్టుంటుంది. చాలా తక్కువ మాట్లాడతాడు.. కానీ ప్రతి మాటా ఓ మిస్సైల్‌లా దూసుకొస్తుంది. ఒక్కసారే మాటిస్తాడు... ప్రాణం ఉన్నంత వరకూ దానికి కట్టుబడి ఉంటాడు. అందుకే... అతను 'బాద్‌షా' అయ్యాడు. ఇంతకీ అతని గమ్యం ఏమిటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు శ్రీను వైట్ల.

  ''పేరుకి తగ్గట్టే.. శక్తిమంతమైన కథ ఇది. ఎన్టీఆర్‌ని ఇది వరకెప్పుడూ చూడని కోణంలో చూపిస్తున్నాం. పాత్ర తీరే కాదు.. ఆయన గెటప్‌ కూడా సరికొత్తగా ఉంటుంది''అని నిర్మాత తెలిపారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌.

  ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ పాత్రలో యంగ్ హీరో నవదీప్ కనిపించనున్నారు. ఈ పాత్ర సినిమాలో ఊహించని విధంగా సాగి నవ్వులు పండిస్తూ కీలకమై నిలుస్తుంది అంటున్నారు. అలాగే కెరిర్ చివరి దశలో ఉన్న నవదీప్ కు ఈ పాత్ర బూస్ట్ ఇస్తుంది. అతనికి ఈ సినిమా చాలా మైలైజి ఇచ్చి వరస ఆఫర్స్ తెచ్చి పెట్టే విధంగా సాగుతుందని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. కథ-మాటలు: కోన వెంకట్‌, గోపి మోహన్‌, సంగీతం: తమన్‌.

  English summary
  Srinu Vaitla keeps etching interesting characters for the MS Narayana and incidentally it becomes a high point in the film. The latest we hear is that MS will be essaying the role of a film director in Baadshah and buzz from the sets is that his character is sure to captivate all eyeballs. NTR will be romancing Kajal Aggarwal in this stylish action entertainer for which Thaman is composing the music. Navdeep and Kelly Dorjee will be seen in negative shades in this film, which has an item number by Meenakshi Dixit.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X