»   » ఘనంగా 'ముద్దుగా' లోగో ఆవిష్కరణ

ఘనంగా 'ముద్దుగా' లోగో ఆవిష్కరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విక్రాంత్, పల్లవి ఘోష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ముద్దుగా'. 24 ఫ్రేమ్స్ పతాకంపై సి.వి. రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సతీశ్‌కుమార్ దర్శకుడు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా లోగో, టీజర్‌ను నిర్మాతల మండలి హాలులో జరిగిన కార్యక్రమంలో సీనియర్ సినీ పాత్రికేయుడు పసుపులేటి రామారావు ఆవిష్కరించారు.

దర్శకుడు సతీశ్‌కుమార్ మాట్లాడుతూ "మంచి కథ, మంచి సంగీతం, నాణ్యతతో రొమాంటిక్ కామెడీగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇది మానవ విలువలు, ఫ్యామిలీ డ్రామా మేళవించిన చిత్రం. కీరవాణి వద్ద అసోసియేట్‌గా పనిచేస్తున్న ఎమ్.పి. రామన్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం'' అని చెప్పారు.

Mudduga film logo Launched

నిర్మాత మాట్లాడుతూ- ముద్దుగా ఓ అమ్మాయి, ముద్దుగా ఓ అబ్బాయి, ఇద్దరిమధ్య ముద్దుముద్దుగా ఓ అందమైన ప్రేమకథ, మానవ సంబంధాలమధ్య అల్లుకున్న సున్నితమైన రొమాంటిక్ కామెడీ చిత్రంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అందరూ కొత్త నటీనటులు, టెక్నీషియన్లు పరిచయమవుతున్నారని, హైదరాబాద్, వైజాగ్, అరకు ప్రాంతాలలో మూడు షెడ్యూల్స్‌లో జరిపామని, త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.


సహ నిర్మాతల్లో ఒకరైన రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ "డైరెక్టర్ చాలా బాగా చిత్రాన్ని రూపొందించారు. అక్టోబర్‌లో పాటల్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు. చిత్రంలో ఐదు పాటలున్నాయనీ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నామనీ లైన్ ప్రొడ్యూసర్ బాచి పవార్ తెలిపారు. చలపతిరాజు, మమతారెడ్డి, జానకీరామ్, లీలాకృష్ణ, సూర్య, కిశోర్, సృజన, మహిమ, నాని, భావన తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: గోపరాజు, ఛాయాగ్రహణం: ఎస్.వి. ప్రసాద్, సహ నిర్మాతలు: రామకృష్ణారెడ్డి, చంటి, జానకీరామ్.

English summary
Mudduga film logo Launched on Suday at Producers Council Hall. Mudduga is a film directed by Satish Kumar V.N. Sathish Kumar Says that the film is a romantic comedy with Good Music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu