రజనీకాంత్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్: భార్యతో కలిసి హాజరైన ముఖేష్ అంబానీ
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతరు సౌందర్య వివాహం అపెక్స్ లాబోరేటరీస్ డైరెక్టర్ విశాగన్‌తో ఫిబ్రవరి 11 వైభవంగా జరిగింది. చెన్నైలోని లీలా ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
పెళ్లి అనంతరం గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. కొత్త దంపతులను ఆశీర్వదించడానికి పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ముంబై నుంచి భారత కుబేరుడు, రిలయన్స్ గ్రూఫ్ అధినేత ముఖేష్ అంబానీ తన భార్య నీతా అంబానీతో కలిసి రావడం విశేషం.

నెల రోజుల క్రితం ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన ఆయన కూతురు ఇషా అంబానీ-ఆనంద్ పిరమాల్ పెళ్లి వేడుకకు రజనీకాంత్ తన భార్యతో కలిసి అటెండ్ అయిన సంగతి తెలిసిందే. ముఖేష్ అంబానీ దంపతులతో పాటు బాలీవుడ్ నటి కాజోల్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

సౌందర్య దర్శకురాలిగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. విశాగన్ గతేడాది 'వంజగర్ ఉలగమ్' అనే సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఇద్దరికీ ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. సౌందర్య మొదటి వివాహం అశ్విన్ రామ్ కుమార్‌తో 2010 జరిగింది. 2016లో వీడిపోయారు. వీరికి వేద్ కృష్ణ అనే బాబు కూడా ఉన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











