»   » ముమైత్ ఖాన్ 1000 మైళ్ల రోడ్ ట్రిప్

ముమైత్ ఖాన్ 1000 మైళ్ల రోడ్ ట్రిప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ హాట్ ఐటం గర్ల్ ముమైత్ ఖాన్ గుర్తుందా...? తన హాట్ అండ్ సెక్సీ ఐటం సాంగులతో తెలుగు కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేసిన ఆమె ఈ మధ్య అసలు సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. గతేడాది 'అడిక్షన్' అనే సింగిల్ ఆల్బమ్ ద్వారా తనలోని సింగింగ్ టాలెంట్ బయట పెట్టిన అమ్మడు తాజా ఈ రంగంలో ఉన్నత స్థాయికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటోంది.

అందులో భాగంగా భారీ రోడ్ ట్రిప్ కు ప్లాన్ చేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ముమైత్ ఫిలడెల్ఫియా నుండి ఫ్లోరిడాలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో తంపా బే కు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసింది. దాదాపు 22 రోజుల పాటు సాగే వెయ్యి మైళ్ళ ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక చోట్ల ముమైత్ మ్యూజిక్ ఫెస్టివల్స్ లో పాల్గొనబోతోందట.

Mumaith Khan 1000 Miles Road Trip

తాను ఓపెన్ మైండ్ తో ఈ ప్రయాణం మొదలెట్టానని, కొత్త భాషలతో, కొత్తవారితో మమేకం కావడం తనను ఎగ్జైట్ చేస్తోందని చెబుతోంది. ఇండియాతో పోలిస్తే అమెరికాలో సంపాదన ఎక్కువగా ఉండటంతో ఇక్కడే నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. వీలైతే అక్కడే సెటిలవ్వాలని ముమైత్ ఖాన్ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా ఈ హాట్ బ్యూటీ ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. మరి ముమైత్ ఖాన్ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

English summary
Mumaith has turned workless with arrival of fresh talent every year. The voluptuous babe has taken a new decision to stay in public interest. She has planned a road trip of 22 days during which she will travel 1000 miles. The road trip is going to be a fun ride, as told by the actress.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu