»   » ఇప్పటికి నలుగురితో, ఇక ఎవరితోనూ సంబంధం పెట్టుకోను: ముమైత్ ఖాన్

ఇప్పటికి నలుగురితో, ఇక ఎవరితోనూ సంబంధం పెట్టుకోను: ముమైత్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ముమైత్ ఖాన్ పేరు వింటే..... టాలీవుడ్లో హాట్ హాట్ ఐటం సాంగులే గుర్తుకొస్తాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వం మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'పోకిరి' సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ఐటం సాంగుతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముమైత్ ఖాన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటోంది.

ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ రన్ చేస్తున్న ముమైత్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు తన లైఫ్ లో నలుగురితో సహజీవనం చేసానని, అయితే ఆ సంబంధాలన్ని ఇపుడు ముగిసిపోయాయని ఆమె తెలిపారు.

ఎవరితో ఎన్ని రోజులు సహజీవనం అంటే

ఎవరితో ఎన్ని రోజులు సహజీవనం అంటే

తొలి సహజీవనం నాలుగేళ్ల పాటు కొనసాగిందని, రెండో వ్యక్తితో మూడున్నర ఏళ్ల పాటు కలిసున్నాను, మూడో వ్యక్తితో రెండేళ్ల పాటు సాగింది. అయితే నాలుగో వ్యక్తితో ఏడాదిన్నరలోనే బంధం ముగిసింది అని ముమైత్ ఖాన్ చెప్పుకొచ్చారు.

ఇకపై ఎవరితోనూ సహజీనవం చేయను

ఇకపై ఎవరితోనూ సహజీనవం చేయను

నేను చాలా ఫ్రెండ్లీ, రొమాంటిక్, మరియు కేరింగ్ గా ఉంటాను. నాకు నేను 10/10 మార్కులు వేసుకుంటాను. కానీ రిలేషన్ షిప్స్ విషయంలో ఎంత రొమాంటిక్ గా ఉంటానో నాకు నేనుగా రేటింగ్ ఇచ్చుకోలేను అని ముబైత్ ఖాన్ తెలిపారు.

ఇకపై డబ్బు వేస్ట్ చేసుకోను

ఇకపై డబ్బు వేస్ట్ చేసుకోను

ఇకపై ఎలాంటి రిలేషన్ షిప్స్ పెట్టుకోలేను, డబ్బును కూడా వేస్ట్ చేయదల్చుకోలేదు. గతంలో ఓ రిలేషన్ షిప్ కోసం సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని... ఆ ఆపరేషన్ కోసం రూ. 27 లక్షలు ఖర్చయిందని ముమైత్ తెలిపింది.

మెదడులో ఖరీదైన టైటానియ్ వైర్లున్నాయి

మెదడులో ఖరీదైన టైటానియ్ వైర్లున్నాయి

ప్రస్తుతం తన మెదడులో 9 ఖరీదైన టైటానియం వైర్లు ఉన్నాయని. వాటి వల్ల తాను ఓ ఎక్స్ మెన్ అనే భావన కలుగుతోందని ముమైత్ ఖాన్ చెప్పుకొచ్చారు.

డబ్బు కోసం కష్టపడ్డ రోజులు

డబ్బు కోసం కష్టపడ్డ రోజులు

ఒకప్పుడు డబ్బు కోసం చాలా కష్టపడ్డాను. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న తపనతో డాన్సర్ గా కెరీర్ ప్రారంభించాను, ఈ క్రమంలో రెమో డిసౌజా టీంలో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా జాయినైనట్లు ముమైత్ ఖాన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

కష్టాలు తీరాయి

కష్టాలు తీరాయి

మున్నాభాయ్ సినిమాలో పాట కోసం ఆడిషన్ కు వెళ్లానని, అదృష్టం కలిసివచ్చి ఐటెం సాంగ్ కు సెలెక్ట్ అయ్యానని... ఆ తర్వాత తన జీవితం మారిపోయిందని, అదృష్టంతో పాటు మంచి అవకాశాలు రావడంతో తన కష్టాలన్నీ తీరిపోయానని ఆమె తెలిపారు.

పూరి గురించి

పూరి గురించి

పూరీ జగన్నాథ్ తో తన స్నేహం స్వచ్ఛమైంది. మా మధ్య స్నేహం తప్ప మరెలాంటి ఎఫైర్ లేదు. పూరి పెద్ద డైరెక్టర్ కాబట్టే ఆయనపై బురద జల్లడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు ముమైత్.

మహేష్, రాజమౌళి, ప్రభాస్

మహేష్, రాజమౌళి, ప్రభాస్

కెరీర్లో రాజమౌళి, పూరీ జగన్నాథ్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి మంచి మనుషులతో పని చేసే అవకాశం దక్కడం తన అదృష్టమని ముమైత్ తెలిపారు.

తేడా చూడను, అందుకే సీ గ్రేడ్ సినిమాల్లో

తేడా చూడను, అందుకే సీ గ్రేడ్ సినిమాల్లో

తాను పనిలో తేడాలు చూడను. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని చూడను. అందుకే సీ గ్రేడ్ సినిమాలలో కూడా చేసాను అని తెలిపారు.

కష్టం ఒకటే, గౌరవించండి

కష్టం ఒకటే, గౌరవించండి

సినిమాకు ఎవరైనా పడే కష్టం అందరిదీ ఒకటేనని, అయితే పనులు వేరు, వేతనాలు వేరు. అందరికీ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనుషులుగా మనపై ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

ముమైత్ ఖాన్ ఫ్యామిలీ

ముమైత్ ఖాన్ ఫ్యామిలీ

ముమైత్ ఖాన్ ఫ్యామిలీ పాకిస్థాన్ నుండి ఇండియా వచ్చారు. ఆమె చిన్నతనంలోనే వారి కుటుంబం ఇండియాకు షిప్ట్ అయింది. ముంబై శివార్లలో వారి కుటుంబం సెటిలైంది.

 తండ్రి ఇండియా, తల్లి పాకిస్థాన్

తండ్రి ఇండియా, తల్లి పాకిస్థాన్

ముమైత్ ఖాన్ తండ్రి తమిళనాడుకు చెందిన ఇండియన్. తల్లి మాత్రం పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి.

నలుగురు సిస్టర్స్

నలుగురు సిస్టర్స్

ముమైత్ ఖాన్ కు నలుగురు సిస్టర్స్. తన సంపాదనతో ఆమె తన కుటుంబానికి సపోర్టుగా నిలుస్తోంది.

 నెలకు 1500 రూపాయలతో..

నెలకు 1500 రూపాయలతో..

కుటుంబానికి అండగా నిలిచేందుకు కెరీర్ తొలి నాళ్లలో ఆమె నెలకు రూ.1500 జీతానికి ఓ డాన్స్ ట్రూపులో జాయినైంది.

టర్నింగ్ పాయింట్

టర్నింగ్ పాయింట్

హిందీ మూవీ మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలో అవకాశం రావడం ముమైత్ కెరీర్లో టర్నింగ్ పాయింట్.

English summary
'My First Relationship was for 4 years. My Second One lasted for 3-and-a-Half, Third went on for 2 years and the Fourth ended in 1-and-a-Half. I'm very friendly, romantic and caring person. I would give myself 10/10. But, I can't rate myself how romantic I'm when it comes to relationships' Mumaith Khan said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more