For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆకలీ, పేదరికం, కన్నీళ్ళూ: ఇప్పుడు ఇలా ఉన్న ముమైత్ గతజీవితం ఇదీ

  |

  ముమైత్ ఖాన్ పేరు వింటే..... టాలీవుడ్లో హాట్ హాట్ ఐటం సాంగులే గుర్తుకొస్తాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వం మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'పోకిరి' సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ఐటం సాంగుతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముమైత్ ఖాన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటోంది. కానీ హఠాత్తుగా ఇప్పుడు ఎక్కడా లేనంతగా ఆమె మీడియాలో కనిపించింది.

  ముమైత్ పాత్ర మీదనే ఎక్కువ దృష్టి

  ముమైత్ పాత్ర మీదనే ఎక్కువ దృష్టి

  బిగ్ బాస్ షోలో ఉన్న ముమైత్ కంటే డ్రగ్స్ కేసులో ముమైత్ పాత్ర మీదనే ఎక్కువ దృష్టి ఉంది. అసలు ఇంత గా పాపులర్ అయిపోయిన ముమైత్ అసలు నటి కాకముందు జీవితం ఏమిటి? అసలు ముమైత్ అంత కటినంగా, ప్రపంచాన్ని లెక్క చేయనంత మొండి గా ఎలా మారిందీ? ఇప్పుడు డ్రగ్స్ కేసులోనూ ఆమె పేరు వినిపించటానికి కారణం అయిన ఆ మత్తు కు బానిస కావటానికి ఆమె జీవితం లో ఉన్న ఫ్రస్ట్రేషనే కారణమా?? ఒక్క సారి ఆమె జీవితాన్ని చూస్తే....

  Bigg Boss Telugu : Mumaith Khan Trolled For Hugging Dhanraj
  తల్లి పాకిస్థానీ

  తల్లి పాకిస్థానీ

  ముమైత్ తల్లి పాకిస్థానీ, తండ్రి తమిళియన్. ఎన్నో సంవత్సరాల క్రితమే ముమైత్ తాత పాక్ నుంచి ముంబై ప్రాంతానికి వలస వచ్చి నివాసం ఏర్పరచుకున్నాడు. ఆపై కూతురు నచ్చిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వారికి ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు. వారిలో పెద్దమ్మాయే ముమైత్ ఖాన్.

  నెలకు రూ. 1500 జీతానికి

  నెలకు రూ. 1500 జీతానికి

  పిల్లల పెంపకం భారం కాగా, తండ్రి బాధ్యతను పంచుకునేందుకు ముమైత్ చిన్నతనంలోనే నెలకు రూ. 1500 జీతానికి ఓ డ్యాన్స్ ట్రూప్ లో చేరింది. అక్కడే ఆమె తన ప్రతిభ బయటపడింది.సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యేలా చేసింది. ముమైత్ సోదరి జోగిన్ ఖాన్ కూడా నాట్యంలో సిద్ధహస్తురాలే.

  "పోకిరి" చిత్రం

  ఆమె కొన్ని తమిళ చిత్రాల్లో నటించింది కూడా. పూరీ జగన్నాథ్ తీసిన 'పోకిరి' చిత్రంలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' అనే ఐటమ్ సాంగ్ ముమైత్ ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయగా, ఆపై ఎన్నో అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. సుమారు 40 వరకూ హిందీ, తెలుగు, కన్నడ చిత్రాల్లో ఆమెకు అవకాశాలు లభించాయి.

   సౌత్ లో బాగా పాపులర్ అయింది.

  సౌత్ లో బాగా పాపులర్ అయింది.

  ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో బాగా పాపులర్ అయిన ఐటం గర్ల్స్ ఎవరు అంటే అందులో తప్పకుండా వినిపించే పేరు ముమైత్ ఖాన్. పోకిరి సినిమాలో ఐటం సాంగ్ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్లిన ముమైత్ ఖాన్ తర్వాత సౌత్ లో బాగా పాపులర్ అయింది.

   చాలా కష్టపడిందట

  చాలా కష్టపడిందట

  అయితే ముమైత్ ఖాన్ ఒకప్పుడు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడిందట. చిన్నతనం లో పూటగడవటం కూడా కష్టమైనప్పుడు మా ఇంటికి చుట్టాలు వస్తే బావుండు ఏదైనా తెస్తారు కదా అని దేవున్ని ప్రార్థించేదట.. ముమైత్‌ఖాన్ ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 40 వరకూ హిందీ, తెలుగు, కన్నడ చిత్రాల్లో ఆమెకు అవకాశాలు లభించాయి.

  ముమైత్‌కు డ్ర‌గ్స్‌కేసు

  ముమైత్‌కు డ్ర‌గ్స్‌కేసు

  ఇప్పుడు సినీ నటిగా, సెలబ్రిటీగా, ఐట‌మ్‌గ‌ర్ల్ అంటె ప్రేక్ష‌కుల‌కు ముందుగా గుర్తుకొచ్చేది ముమైత్ ఖాన్.ఐట‌మ్ సాంగ్స్‌లో న‌టించిందంటె ధియేట‌ర్‌లో ప్రేక్ష‌కుల నీరాజ‌నాలె.కాని ఇప్పుడు సినిమాలులేక అల్లాడుతున్న ముమైత్‌కు డ్ర‌గ్స్‌కేసు మ‌రిన్ని చిక్కులు తెచ్చి పెట్టేలా ఉంది.

  English summary
  Mummaith suffered extreme poverty and deprovation during childhood. "None of our relatives helped us," Mumait Khan admits candidly. "On Id we would stand in our courtyard, thinking, Koi to Idi dega, but it never happened." Said Mumaith in a interview
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X