»   » డబ్బు కోసమే చేసా, ఇంట్లో వాళ్లు నన్ను ఇంకా అలానే చూస్తున్నారు: ముమైత్ ఖాన్

డబ్బు కోసమే చేసా, ఇంట్లో వాళ్లు నన్ను ఇంకా అలానే చూస్తున్నారు: ముమైత్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో బాగా పాపులర్ అయిన ఐటం గర్ల్స్ ఎవరు అంటే అందులో తప్పకుండా వినిపించే పేరు ముమైత్ ఖాన్. పోకిరి సినిమాలో ఐటం సాంగ్ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్లిన ముమైత్ ఖాన్ తర్వాత సౌత్ లో బాగా పాపులర్ అయింది. అయితే ముమైత్ ఖాన్ ఒకప్పుడు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఇందుకు సంబంధించిన విషయాలు చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు డబ్బు కోసం చాలా కష్టపడ్డాను. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న తపనతో డాన్సర్ గా కెరీర్ ప్రారంభించాను, ఈ క్రమంలో రెమో డిసౌజా టీంలో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా జాయినైనట్లు ఆమె తెలిపారు.

మున్నాభాయ్ సినిమాలో పాట కోసం ఆడిషన్ కు వెళ్లానని, అదృష్టం కలిసివచ్చి ఐటెం సాంగ్ కు సెలెక్ట్ అయ్యానని... ఆ తర్వాత తన జీవితం మారిపోయిందని, అదృష్టంతో పాటు మంచి అవకాశాలు రావడంతో తన కష్టాలన్నీ తీరిపోయానని ఆమె తెలిపారు.

ఐటెం గర్ల్ గా సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడంతో అవకాశాలతో పాటు, పాపులారీటీ వచ్చింది....మొదట్లో డబ్బు కోసం చాలా కష్టపడ్డాను. అయితే ఇపుడు అలాంటి పరిస్థితి లేదని ఆమె తెలిపారు. సినీ పరిశ్రమలో తనకు ఇంత పేరున్నా.... ఇంట్లో వాళ్లు మాత్రం నన్ను స్టార్ గా చూడరు, ఇంకా మామూలు అమ్మాయిగానే చూస్తారని వెల్లడించారు.

పూరి గురించి

పూరి గురించి

పూరీ జగన్నాథ్ తో తన స్నేహం స్వచ్ఛమైంది. మా మధ్య స్నేహం తప్ప మరెలాంటి ఎఫైర్ లేదు. పూరి పెద్ద డైరెక్టర్ కాబట్టే ఆయనపై బురద జల్లడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు ముమైత్.

మహేష్, రాజమౌళి, ప్రభాస్

మహేష్, రాజమౌళి, ప్రభాస్

కెరీర్లో రాజమౌళి, పూరీ జగన్నాథ్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి మంచి మనుషులతో పని చేసే అవకాశం దక్కడం తన అదృష్టమని ముమైత్ తెలిపారు.

తేడా చూడను, అందుకే సీ గ్రేడ్ సినిమాల్లో

తేడా చూడను, అందుకే సీ గ్రేడ్ సినిమాల్లో

తాను పనిలో తేడాలు చూడను. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని చూడను. అందుకే సీ గ్రేడ్ సినిమాలలో కూడా చేసాను అని తెలిపారు.

కష్టం ఒకటే, గౌరవించండి

కష్టం ఒకటే, గౌరవించండి

సినిమాకు ఎవరైనా పడే కష్టం అందరిదీ ఒకటేనని, అయితే పనులు వేరు, వేతనాలు వేరు. అందరికీ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనుషులుగా మనపై ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

ముమైత్ ఖాన్ ఫ్యామిలీ

ముమైత్ ఖాన్ ఫ్యామిలీ

ముమైత్ ఖాన్ ఫ్యామిలీ పాకిస్థాన్ నుండి ఇండియా వచ్చారు. ఆమె చిన్నతనంలోనే వారి కుటుంబం ఇండియాకు షిప్ట్ అయింది. ముంబై శివార్లలో వారి కుటుంబం సెటిలైంది.

తండ్రి ఇండియా, తల్లి పాకిస్థాన్

తండ్రి ఇండియా, తల్లి పాకిస్థాన్

ముమైత్ ఖాన్ తండ్రి తమిళనాడుకు చెందిన ఇండియన్. తల్లి మాత్రం పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి.

నలుగురు సిస్టర్స్

నలుగురు సిస్టర్స్

ముమైత్ ఖాన్ కు నలుగురు సిస్టర్స్. తన సంపాదనతో ఆమె తన కుటుంబానికి సపోర్టుగా నిలుస్తోంది.

నెలకు 1500 రూపాయలతో..

నెలకు 1500 రూపాయలతో..

కుటుంబానికి అండగా నిలిచేందుకు కెరీర్ తొలి నాళ్లలో ఆమె నెలకు రూ.1500 జీతానికి ఓ డాన్స్ ట్రూపులో జాయినైంది.

టర్నింగ్ పాయింట్

టర్నింగ్ పాయింట్

హిందీ మూవీ మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలో అవకాశం రావడం ముమైత్ కెరీర్లో టర్నింగ్ పాయింట్.

బిజీ బిజీ

బిజీ బిజీ

ఆ సినిమా తర్వాత ముమైత్ ఖాన్ సినీ పరిశ్రమలో ఐటం గర్ల్ గా బిజీ అయిపోయింది.

అవకాశాలు తగ్గాయి

అవకాశాలు తగ్గాయి

ప్రస్తుతం ముమైత్ ఖాన్ కు గతంతో పోలిస్తే అవకాశాలు తగ్గాయి. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా అన్నింటిలోనూ పాల్గొంటోంది.

రికార్డింగ్ ట్రూప్స్ లో కూడా?

రికార్డింగ్ ట్రూప్స్ లో కూడా?

ఆ మధ్య వైజాగ్ సమీపంలో ఓ పల్లెటూరులో ఏర్పాటు చేసిన రికార్డింగ్ డాన్స్ షోలలో కూడా ముమైత్ ఖాన్ పాల్గొన్నట్లు సమాచారం. ఇందుకుగాను ఆమె రూ. 6 లక్షల వరకు పారితోషికం తీసుకున్నట్లు టాక్.

English summary
Mumaith Khan interview about personal details. Mumaith Khan is an Indian film actress known for her item numbers. She has acted in Telugu, Hindi, Tamil and Kannada language films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu