»   » హీరో చెల్లి బర్తడే పార్టీ.. న్యూసెన్స్ కేసు...పోలీసు ఎంట్రీ

హీరో చెల్లి బర్తడే పార్టీ.. న్యూసెన్స్ కేసు...పోలీసు ఎంట్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ సోదరి అర్పితాఖాన్‌ పుట్టినరోజు వేడుకను శనివారం రాత్రి ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముంబయి ఖర్‌ ప్రాంతంలోని పెసిఫిక్‌ హైట్స్‌లో పుట్టినరోజు వేడుక ఏర్పాట్లు చేసిన సంతోష్‌మానే అనే వ్యక్తి మ్యూజిక్‌ సౌండ్‌ ఎక్కువ పెట్టాడు. దీంతో స్థానికులకు ఇబ్బంది కలగడంతో వారు సంతోష్‌పై న్యూసెన్స్‌ కేసు పెట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సంతోష్‌కి రూ.12,000 జరిమానా విధించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సల్మాన్ తల్లిదండ్రులు అర్పితను దత్తత తీసుకున్నారు. అర్పిత తల్లి ఇల్లు లేక ఫుట్‌పాత్ మీద బతికేది.. ఆమె చనిపోవడంతో అర్పిత దిక్కులేనిది అయిపోయింది. అప్పుడే సలీమ్ భార్య హెలెన్ స్పందించి అర్పితను దత్తత తీసుకుంది. కుటుంబంలో అందరికంటే చిన్నది కావడంతో సల్మాన్‌తో సహా కుటుంబ సభ్యులందరూ అర్పితను ముద్దుగా చూసుకునేవారు.

Mumbai cops bust Arpita Khan Sharma's birthday bash

సల్మాన్ ఎంత బిజీ బాలీవుడ్ యాక్టర్ అయినా అర్పితకు స్పెషల్ టైమ్ ఇస్తాడు. అర్పిత అంటే సల్మాన్‌కు చాలా ఇష్టం. తండ్రి వయస్సు ఉన్నా ఇద్దరు స్నేహితుల్లా క్లోజ్‌గా ఉంటారు. అన్ని విషయాలూ షేర్ చేసుకుంటారు. ఇద్దరి మధ్య బ్యూటిఫుల్ బాండింగ్ ఉంది. అన్నయ్య చాలా బిజీగా ఉంటారు. అయినా మా మధ్య ఈజీ గోయింగ్ రిలేషన్‌షిప్ ఉంది. కానీ సల్మాన్ భాయ్‌కి మనుషుల్ని అర్థం చేసుకోవడం పెద్దగా రాదు అని దాపరికం లేకుండానే చెబుతుంది అర్పిత.

కొద్ది రోజుల క్రితం... బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ సోదరి అర్పితాఖాన్‌ తొలిసారిగా తన అత్తగారిల్లయిన మండీకి భర్త ఆయుష్‌శర్మతో కలిసి మండీ (హిమాచల్‌ప్రదేశ్‌) వెళ్లింది. గత నవంబరులో పెళ్లయిన తర్వాత అర్పితాఖాన్‌ వాళ్లాయనతో కలిసి ఇక్కడికి రావడం ఇదే ప్రధమం.

ఈ సందర్భంగా మామగారైన హిమాచల్‌ ప్రదేశ్‌ మంత్రి అనిల్‌శర్మ అక్కడ బ్రహ్మాండమైన విందు నిచ్చారు. ఇందుకోసం అమ్మ, అన్నయ్య తదితరులు వెంటరాగా సల్మాన్‌ఖాన్‌ ఇక్కడికి తరలి వచ్చారు. అక్కడ సల్మాన్‌ హిమాచల్‌ వంటకాలను రుచిచూశారు. స్థానిక జానపద సంగీతానికి అనుగుణంగా నాట్యం చేశారు.

English summary
Mumbai cops bust Arpita Khan Sharma's birthday bash.Cops disrupted all the fun at the party.Reports suggest that the loud music being played at the birthday bash concerned the neighbours and police arrived at the scene to stop the party from continuing into the night.
Please Wait while comments are loading...