»   » రామ్ చరణ్ 'తుఫాను' టీమ్ కు హైకోర్టు షాక్

రామ్ చరణ్ 'తుఫాను' టీమ్ కు హైకోర్టు షాక్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్‌: రాంచరణ్‌, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న చిత్రం 'జంజీర్‌'. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 'తుఫాను' పేరుతో తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందించిన ట్రైలర్స్ హైదరాబాద్ లో విడుదల చేసారు. అయితే ముంబై హై కోర్టు తక్షణమే ఈ ట్రైలర్స్ ని విత్ డ్రా చేసుకోమని ఆర్డర్ వేసింది. అలాగే హిందీ వెర్షన్ ట్రైలర్స్ మీద కూడా ఆంక్షలు విధించింది.

  దానికి కారణం... ఈ చిత్రం కాపీ రైట్స్ విషయంలో కోర్టులో కేసు నలుగుతూ ఉండటమే. ఈ చిత్ర నిర్మాత అమిత్ మెహ్రాకు వ్యతిరేకంగా అతని సోదరులు (ప్రకాష్ మెహ్రా కుమారులు) సుమీత్, పునీత్ కోర్టుకు వెళ్లారు. ఈ విషయమై వారి లాయిర్ మాట్లాడుతూ... " జంజీర్ రీమేక్ కు సంభందించిన ట్రైలర్స్ ని ఆపుచేయమని హై కోర్టు సోమవారం మధ్యాహ్నం తీర్పు ఇచ్చింది. మేము సర్టిఫైడ్ కాపీలు కోసం అప్లై చేసుకున్నాం ." అన్నారు.

  ముందుగా అనుకున్న డబ్బు సెటిల్ చేసి ఇవ్వకపోవటం వల్ల జంజీర్ రైట్స్ కాన్సిల్ చేస్తున్నట్లు హక్కుదారులు తేల్చి చెప్పి కోర్టు కెక్కారు. ఇక ఈ వివాదం మొదలైంది చిత్రం రైట్స్ కి చెందిన ముగ్గురు అన్నదమ్ముల మధ్యనే కావటం విశేషం. తమ తండ్రి నిర్మించిన జంజీర్ రైట్స్ కొడుకులకు రాగా, అందులో ఒకతను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మిగతా ఇద్దరు సోదరులకు హక్కులు తాలుకు డబ్బులిస్తానని చెప్పాడు.

  కానీ మొదట అనుకున్న ప్రకారం ఇవ్వకపోవటంతో వారు కోర్టుకు ఎక్కారు. ఇప్పుడు వ్యవహారం కోర్టుకు వెళ్లింది. సినిమా షూటింగ్ కి ఇది ఏ విధమైన ఇబ్బంది ఎదురౌతుందో అనే సందేహంలో ఇప్పుడు హీరో, దర్శకులు పడ్డారు. ముఖ్యంగా ఇప్పుడెలా ఉన్నా విడుదల సమయంలో ఏ విధమైన లీగల్ తలనొప్పులూ ఉండకూడదు. అప్పుడు క్లియరెన్స్ రాకపోతే చాలా పెద్ద సమస్య. ఈ లోగా సెటిల్ చేసుకుంటారనే అనుకుంటున్నారు.

  ఇక ట్రైలర్స్ విడుదల చేయటంతో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మొదట్లో అందరూ దీన్నో డబ్బింగ్ సినిమాగా పరిగణించారని, ట్రైలర్స్ విడుదల అయ్యాక ఒక్కసారిగా ఊహించని రీతిలో క్రేజ్ పెరిగిందని చెప్తున్నారు. 'తుఫాను' తెలుగు వెర్షన్ కి దర్శకుడు యోగి దగ్గరుండి తెలుగు నేటివిటీ అద్దటం ప్లస్ అయ్యిందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ మంచి మొత్తానికి అమ్ముడయ్యాయి. గబ్బర్ సింగ్ రేంజిలో ఈ పోలీస్ చిత్రం కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుందని భావిస్తున్నారు.

  English summary
  Zanjeer promotions hit hard as Bombay High Court bars both the Hindi and Telugu versions from being released. Apoorva Lakhia, Priyanka Chopra and Ram Charan Teja may have never even thought in their worst nightmares that so many things could go wrong with their upcoming film, Zanjeer in such a short while. After one of the leading stars of the film, Sanjay Dutt was sentenced to imprisonment by the Supreme Court, the Bombay High Court has delivered a shocker.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more