twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్ హిట్ 'ముంబయి పుణె ముంబయి' చిత్రం తెలుగు రీమేక్

    By Srikanya
    |

    'Mumbai Pune Mumbai' to be remade in Telugu and Tamil
    హైదరాబాద్ : మరాఠీలో చిన్న చిత్రంగా రిలీజై భారీ కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం 'ముంబయి పుణె ముంబయి'. ప్రస్తుతం ఇది 'మేడిన్‌ వైజాగ్‌' గా రీమేక్ అవుతోంది. అలాగే తమిళంలో 'నీ నాన్‌ మట్టుం'గా పునర్నిర్మితమవుతోంది. నిషా నెహ్రూ ప్రొడక్షన్‌ పతాకంపై ఉదయ్‌శంకర్‌ నిర్మిస్తున్నారు. యశ్విన్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. నిఖితా నారాయణ్‌ హీరోయిన్. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు కన్మణి ఈ చిత్రాన్ని పూర్తి ఎంటర్టైన్మెంట్ గా రూపొందిస్తున్నాడు.

    ఈ చిత్రం కాన్సెప్టు గురించి దర్శకుడు మాట్లాడుతూ... అమ్మాయిలు ఎప్పుడూ తమ అందం గురించే పొగడాలంటారు. నువ్వు అచ్చం ఐశ్వర్య రాయ్‌లా ఉన్నావంటే చాలు... గాల్లో తేలిపోతారు. ఓ అమ్మాయి మాత్రం అందుకు భిన్నం. తన వూరి గురించి మాత్రం గొప్పగా చెప్పాలంటుంది. ఆ కుర్రాడు మాత్రం 'కాదు... మా వూరే గొప్ప' అంటాడు. అలా గిల్లికజ్జాలతో మొదలైన వారిద్దరి పరిచయం ఎక్కడిదాకా చేరిందో తెరపైనే చూడాలంటున్నారు.

    నిర్మాత మాట్లాడుతూ ''విశాఖపట్నం వెళ్లిన ఓ అమ్మాయి చుట్టూ సాగే కథ ఇది. అక్కడ పరిచయమైన ఓ కుర్రాడి వల్ల ఆ అమ్మాయి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయనేది ఆసక్తికరం. ఒక యువతి తెలియని ప్రాంతానికి వెళ్లి అక్కడో యువకుడితో పరిచయం పెంచుకుంటుంది. ఆ క్రమంలో ఎదురయ్యే తీయని అనుభవాలనే ఇందులో పొందుపరిచాము. 'ముంబయి పుణె ముంబయి' అనే మరాఠీ చిత్రానికి రీమేక్‌ ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నాం. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాము'' అన్నారు.

    సినిమా గురించి హీరో యశ్విన్‌ మాట్లాడుతూ.. తెలుగులో రెండు సినిమాలు చేశాను. మంచి పేరొచ్చింది. ఇప్పుడు తమిళంలో పరిచయమవుతుండటం ఎంతో ఆనందంగా ఉంది. నేను పెరిగింది ఇక్కడే. సాధారణ యువకుడిగా చెన్నై నుంచి వెళ్లాను. ఇప్పుడు హీరోగా అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. కోలీవుడ్‌లో కనిపించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ మంచి కథ, నటనతోనే రాణించగలం. అందుకోసం చేసిన నిరీక్షణ 'మేడిన్‌ వైజాగ్‌' తో తీరిందని చెప్పాడు. ఈ చిత్రంలో 'అంగాడితెరు' పాండి, 'బరోటా' సూరి హాస్యపాత్రలు పోషిస్తున్నారు.

    చిత్రం కథేమిటంటే... హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఓ అందమైన అమ్మాయి తొలిసారిగా వైజాగ్ వెళుతుంది. అక్కడి వాతావరణం, మనుషుల మనస్తత్వాలు ఆమెకో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. ముఖ్యంగా ఓ అబ్బాయితో పరిచయం ఆమె జీవితంలో కీలక పరిణామాలకు కారకమవుతుంది. ఈ నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా సాగే సినిమా ఇది. వేణుమాధవ్, కొండవలస, గౌతంరాజు, కాదంబరి కిరణ్, జయశీల తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: యడవల్లి, సంగీతం: ధర్మతేజ, విశ్వజిత్ జోషి, కళ: సత్యనారాయణ, కెమెరా: నాగమల్లి, ఎడిటింగ్: సురేష్ అర్స్.

    English summary
    
 Director Satish Rajwade's rom-com hit 'Mumbai Pune Mumbai' (2010) will now be remade in two south versions — Telugu and Tamil. A Udayashankar is producing both the remakes and director Kanmani will be directing the Telugu version titled 'Made in Vizag'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X