»   » హీరోయిన్ కృతికా చౌదరి మృతి, కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం, హత్యేనా?

హీరోయిన్ కృతికా చౌదరి మృతి, కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం, హత్యేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటి కృతికా చౌదరి (30) మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో ముంబై పోలీసులు కనుగొన్నారు. ముంబైలోని అంధేరీ ప్రాంతంలోని తన ఇంట్లో ఆమె విగతజీవిగా పడిఉంది. కృతిక చౌదరి ఇంటి నుండి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కలవారు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంట్లోకి వెళ్లగా కృతిక చౌదరి మరణించి కనిపించింది.

కృతిక మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో పడి ఉంది. దాదాపు నాలుగు రోజుల క్రితమే ఆమె మరణించినట్లు భావిస్తున్నారు. అయితే ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే విషయాలు ఇంకా తేల్చలేదు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

హత్య అనే అనుమానాలు

హత్య అనే అనుమానాలు

అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసినప్పటికీ..... దీన్ని హత్య కోణంలోనే విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది హత్యే అనే అనుమానాలు కలిగించే పలు విషయాలు సేకరించామని తెలిపారు.

అనుమానంతో ఫిర్యాదు

అనుమానంతో ఫిర్యాదు

అంధేరీ వెస్ట్ ప్రాంతంలోని చార్ బంగ్లా ప్రాంతంలో ఉన్న భైరవ్ నాథ్ సొసైటీలో ఆమె నివాసం ఉంటున్నారు. అయితే రెండు రోజుల నుండి ఆమె ఉంటున్న ఇంటి నుండి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అవకాశాల కోసం స్ట్రగుల్

అవకాశాల కోసం స్ట్రగుల్

కృతికా చౌదరి బాలీవుడ్లో సరైన అవకాశాలు లేక చాలా కాలంగా స్ట్రగుల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆమె మరణించడం అదరినీ కలిచి వేసింది.

హరిద్వార్ నుండి

హరిద్వార్ నుండి

కృతికా చౌదరి హరిద్వార్ కు చెందిన అమ్మాయి. హీరోయిన్ కావాలనే కలలతో కొన్ని సంవత్సరాల క్రితం ఆమె ముంబై వచ్చారు.

టీవీ నటిగా ప్రారంభం

టీవీ నటిగా ప్రారంభం

తొలుత టీవీ నటిగా కృతికా చౌదరి కెరీర్ ప్రారంభించారు. 2011లో వచ్చిన పరిచయ్ అనే సీరియల్ లో నటించారు. 2013లో వచ్చిన రాజ్జో సినిమాలో కూడా నటించారు.

English summary
Kritika Chaudhary, a struggling model-cum-actress was found dead at her Mumbai residence on Monday night. She was found dead at her Andheri residence in Amboli area by Mumbai police.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu