twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముమైత్ ఖాన్ సైతం... హాట్ డాన్స్ (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ :ఎప్పుడో కానీ బయటికు రాని సినీ తారలంతా 'మేముసైతం' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చి కలిసికట్టుగా వినోదాలు పంచారు. సాటి మనుషుల్ని ఆదుకోవడం మనందరి బాధ్యత అనే సందేశాన్ని తెలుగు ప్రేక్షకులకు చేరవేశారు. హైదరాబాద్‌లో ఆదివారం 12 గంటలపాటు 'మేముసైతం' పేరిట టెలీథాన్‌ సాగింది. ఈ వేడుకలో చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, గాయకులు, సాంకేతిక నిపుణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందులో భాగంగా 'ఇప్పటికింకా నా వయసు..'అంటూ ముమైత్‌ ఖాన్‌ తన పాటలతో హోరెత్తించింది. ఆ వీడియో మీరూ చూడండి.

    హుద్‌ హుద్‌ తుపాను బాధితుల కన్నీటిని తుడవడమే లక్ష్యంగా చలన చిత్ర పరిశ్రమ అంతా ఒక తాటిపైకి వచ్చింది. మీకు అండగా మేమున్నాం... మీ పెదాలపై మేం చిరునవ్వుని అవుతాం అంటూ భరోసానిచ్చింది. ఉదయం 10 గంటలకు మేముసైతం... అంటూ పి.సుశీల బృందం పాడిన పాటతో వినోద కార్యక్రమాలు మొదలయ్యాయి.

    Mummaith Khan Dance AT Memu Saitam

    ఆ తర్వాత పాటలు, డ్యాన్సులు, కబడ్డీ, ముఖాముఖి, క్రికెట్టు, తంబోలా, అంత్యాక్షరి కార్యక్రమాలు సందడిగా సాగాయి. చిన్న పెద్ద, నాయకానాయికలు అనే తేడా లేకుండా నటీనటులంతా అందరూ కలిసిపోయి ప్రేక్షకులకు వినోదాలు పంచే ప్రయత్నం చేశారు. చిత్ర పరిశ్రమ అంతా ఒక వేదికపై కనిపించడంతో ప్రేక్షకులు పులకరించిపోయారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపూ దాతలు స్పందించి విరాళాలు ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్‌ సంఘంతో పాటు పలువురు నటీనటులు హుద్‌ హుద్‌ బాధితుల సహాయార్థం విరాళాన్ని ప్రకటించారు.

    దాసరి మాట్లాడుతూ...'పరిశ్రమకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించి పైకి తీసుకొచ్చినవాళ్లు ప్రేక్షకులు. అలాంటివారికి కష్టాలు వచ్చినప్పుడు మేము సైతం ఏదో ఒకటి చేయాలని చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. రూపాయి అని కాదు, కోటి రూపాయలు అని కాదు కష్టంలో ఉన్నప్పుడు మేమున్నాం అని ఇచ్చే భరోసా, స్ఫూర్తికోసమే ఈ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాల సమయంలో సినిమావాళ్లు వేరు వేరు అని ప్రచారం చేస్తుంటారు. అది నిజం కాదు. తెర ఉన్నంతవరకు సినిమా పరిశ్రమ ఒక్కటే. ఈ స్ఫూర్తి రాబోయే తరమూ కొనసాగించాలి. ఇలాంటి విపత్తులు రాకూడదని మనమంతా కోరుకొందాం'' అన్నారు.

    English summary
    Mumaith Khan danced at Memu Saitham. Telugu Film Industry has donated a whopping Rs 11 Crore 51 Lakh 56 Thousand, One hundred and sixteen rupees.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X