»   » ముని 3 : రాఘవ్ లారెన్స్‌కు గాయాలు

ముని 3 : రాఘవ్ లారెన్స్‌కు గాయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ గాయ పడ్డాడు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ముని-3 : గంగా' షూటింగు కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్లు అతనికి కంప్లీట్‌గా 3 నెలలు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ కాన్సిల్ అయింది.

ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. 'కాంచన' వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని గతంలో బెల్లంకొండ సురేష్ తెలుగు అనువాద హక్కులు దక్కించుకుని భారీ లాభాలు పొందారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాఘవ లారెన్స్ 'ముని-3' చిత్రానికి చేయడానికి ముందుకు వచ్చాడు బెల్లకొండ. లారెన్స్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించే 'ముని-3'లో తాప్సీ హీరోయిన్ గా నటిస్తుంది.

సినిమా గురించి నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...'కాంచన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బేనర్లో లారెన్స్ తో చేస్తున్న 'ముని-3' సబ్జెక్ట్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. హీరోగా, దర్శకుడిగా లారెన్స్ ముని-3 మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు' అన్నారు.

రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

English summary
Raghava Lawrence got injured, while rehearsing a song for his upcoming film Muni 3.
Please Wait while comments are loading...