For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాస్ మసాలా బుల్లెట్ తో...(తుపాకి ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఇళయదళపతి విజయ్, దర్శకుడు ఏఆర్.మురుగదాస్ కాంబినేషనల్ రూపొంది ఈ రోజు విడుదల అవుతున్న మోస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ చిత్రం తుపాకీ. త్రి ఇడియట్స్ తెలుగు వెర్షన్ స్నేహితుడు తో తెలుగు వారిని పలకరించిన తమిళ సూపర్ స్టార్ విజయ్ తన తాజా చిత్రం తుపాకి తో ముందుకు వస్తున్నాడు. గతంలో గజనీ,సెవెంత్ సెన్స్ వంటి చిత్రాలతో తెలుగు వారిని సైతం ఆకట్టుకున్న మురగదాస్ దర్శకుడు కావటంతో ఈ డబ్బింగ్ చిత్రానికి సైతం తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ప్రస్తుతం డబ్బింగ్ చిత్రాలకు తెలుగునాట ఆదరణ కనపడటం లేదు. ఈ నేపధ్యంలో విడుదల అవుతున్న ఈ చిత్రం ఇక్కడ వారిని ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.

  జగదీష్‌ (విజయ్‌) ముంబైలోనే పుట్టి పెరుగుతాడు. అతని తండ్రి ఆర్మీ అధికారి. జీవితాన్ని ఎప్పుడూ సరదాగా గడపాలనుకొంటాడు జగదీష్‌. ముఖ్యమైన వ్యవహారం నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఏం జరిగింది? ముంబైకి తిరిగొచ్చిన జగదీష్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అతని జీవితంలోకి నిషా (కాజల్‌) అనే యువతి ఎలా ప్రవేశించింది? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.

  దర్శకుడు మురగదాస్ మాట్లాడుతూ.... తుపాకీ విషయంలో నేను తొలి నుంచి చెబుతున్న మాట ఒక్కటే. పూర్తిగా కమర్షియల్ ఫార్మెట్‌లో రూపొం దిన మాస్ సూపర్‌స్టార్ రజనీకాంత్ 80, 90లో నటించిన చిత్రాల తరహాలో తుపాకీ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించాను. ఈ చిత్రాన్ని స్నేహితులు, కుటుంబం, పిల్ల లు సహా కలిసి మళ్లీ మళ్లీ చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఏ తరగతికి చెందిన వారు బోర్ ఫీల్‌కారు అన్నారు.

  నిర్మాత శోభారాణి మాట్లాడుతూ ''ఇది పూర్తిగా మురుగదాస్‌ శైలి చిత్రం. పోరాట సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. సంతోష్‌ శివన్‌ ఛాయాగ్రహణం, హారిస్‌ జైరాజ్‌ సంగీతం చిత్రానికి బలాన్నిస్తాయి. తన ప్రతి చిత్రాన్ని ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించే మురుగదాస్ ఈ చిత్రాన్ని కూడా ఓ వండర్‌లా తీర్చిదిద్దాడు. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించబోతుంది '' అన్నారు.

  సంస్థ: ఎస్‌.వి.ఆర్‌.మీడియా ప్రై. లి.
  నటీనటులు: విజయ్‌, కాజల్‌, అక్షరగౌడ, జయరామ్‌, విద్యుత్‌ జమ్వాల్‌, అనుపమ్‌ ఖేర్‌, సత్యన్‌, మనోబాల, ప్రశాంత్‌ నాయర్‌, దీప్తి నంబియార్‌ తదితరులు.
  సంగీతం: హారిస్‌ జైరాజ్‌
  నిర్మాత: శోభారాణి,
  ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్,
  ఫోటోగ్రఫీ: సంతోష్ శివన్
  మాటలు: శ్రీరామకృష్ణ
  దర్శకత్వం: మురుగదాస్‌
  విడుదల: మంగళవారం(13 నవంబర్,2012)

  English summary
  Thuppakki is an action thriller film written and directed by A. R. Murugadoss. The film feature Vijay and Kajal Aggarwal, in the lead roles. The story of the film revolves around a youngster from a Mumbai-based Tamil family. The happy-go-lucky man's life undergoes a sudden turn. The decisions he takes after that is the rest of the story.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X