twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మ కొన్నేళ్ల వరకూ వెక్కి వెక్కి ఏడ్చాడు

    By Srikanya
    |

    RGV
    హైదరాబాద్ : రాముకి ఉన్నతమైన లక్షణాలున్నాయి. డబ్బు సంపాదించగానే తండ్రికి కారు కొనిచ్చాడు. తనకెలాంటి బంధాలూ లేవని రాము చెప్పేది అబద్ధం. నాలుగు ఫ్యామిలీస్ అతని మీద ఆధారపడి ఉన్నాయి. కనీసం వంద మందికి జీవితాధారాన్నిచ్చాడు. తనకు ఎమోషన్ లేదంటాడు కానీ తన తండ్రి చనిపోయిన కొన్నేళ్ల వరకూ వెక్కి వెక్కి ఏడ్చాడు. లోపల ఎమోషన్ లేకుంటే బయటకు దుఃఖం ఎలా వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ మేనమామ మురళీ కృష్ణ రాజు గారు.

    అలాగే ... రాము ఓ గ్రేట్‌మ్యాన్ అని ఊహ వచ్చాక, తను నా మేనల్లుడు అనుకోవడం మానేశాను. నిజం చెప్పాలంటే ఆయన నాకు మామ. నేను మేనల్లుణ్ని. తను ఎప్పటికప్పుడు నా క్షేమ సమాచారాల గురించి తెలుసుకుంటుంటాడు. నేను పెద్దగా ఎవరినీ కలవడానికి ఇష్టపడను. ఒక్క రామూని మాత్రం మళ్లీ మళ్లీ కలవడానికి ఇష్టపడతాను. బాంబేకి వెళ్లి ఫోన్ చేస్తే ఉదయం నుంచి రాత్రి రెండు గంటల వరకు సినిమాకు సంబంధించి అన్ని ప్రాసెస్‌లు దగ్గరుండి చూపిస్తాడు. నన్ను తను ఎంటర్‌టైన్ చేసినట్టు మరెవరూ చేయలేరు.

    ఇక వినోదం రూపంలో ఆతిథ్యం ఇవ్వగలిగే సంస్కారం ఉన్న పెద్దమనిషి ఆయన. తన దగ్గర ఎప్పటికప్పుడు ఏదో కొత్త విషయం నాకు కనిపిస్తూ ఉంటుంది. తనను చిన్నప్పటినుంచీ అబ్జర్వ్ చేస్తున్నాను. చిన్నప్పుడు తనకు కత్తి కాంతారావు అంటే ఇష్టం. వయసులో బ్రూస్లీ, తరువాత అమితాబ్ అంటే ఇష్టం. రాము దేవుడు ఉన్నాడు లేడు అని నమ్మడు. ఒకవేళ దేవుడు ఉన్నా అతనికి మన గురించి అక్కరలేదు. అలాంటప్పుడు అతని గురించి మనం ఎందుకు వర్రీ అవ్వాలి అంటాడు. అది ఒక విధంగా కరెక్టే. సూర్యుడిలా దేవుడు సాక్షి అంతే. నాది అద్వైతం. దేవుడిలో నేనున్నాను, నాలో దేవుడున్నాడు అన్నారు.

    ఇక వర్మకు సినిమాల పట్ల ఆసక్తి కలిగించేలా చేసింది నేనే అన్నది కేవలం తను కల్పించిన ఒక భ్రమ మాత్రమే. కాలేజీలో ఉన్నప్పుడు తను గాడ్‌ఫాదర్ నవలలో పేరాలు, సినిమాలో సీన్స్ అనర్గళంగా చెప్పేవాడు. తరువాత చూస్తే, అందులో చాలావరకు తన ఇమాజినేషన్, ఆర్టిక్యులేషన్ ఉండేది. ప్రపంచ సినిమాలో వెయ్యి అత్యుత్తమ చిత్రాలుంటే, నేను తొమ్మిది వందల సినిమాలు చూశాను. తను మాత్రం వంద చూసుంటాడు. కానీ తను వంద సినిమాలు తీస్తే, నేను ఒక్కటి కూడా తీయలేకపోయాను.

    English summary
    Murali Krishna Raju uncle of RGV says that ...Varma is a emotional person.And adds...he has very much attachment with Family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X