twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉదయ్ కిరణ్ కేసు: క్యాస్ట్ డామినేషన్‌పై మురళి మోహన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సినీ పరిశ్రమలో క్యాస్ట్ డామినేషన్ నడుస్తోందని, ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు క్యాస్ట్ డామినేషన్‌తో ఉదయ్ కిరణ్ లాంటి హీరోలను ఎదగకుండా చేస్తున్నారనే వాదన ఎప్పటి నుండో ఉంది. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ అండిగిన ప్రశ్నకు 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' అధ్యక్షుడు మురళి మోహన్ స్పందిస్తూ...తనకు తెలిసినంత వరకు అలాంటిదేమీ లేదని వ్యాఖ్యానించారు.

    ఇప్పటి వరకు తమకు తెలిసిన వివరాల ప్రకారం అవకాశాలు లేక పోవడం, గౌరవం లేక పోవడం, ఆర్థిక ఇబ్బందులు కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా అప్పటికప్పుడు అంత త్వరగా ఆత్మహత్య చేసుకోవడానికి గల బలమైన కారణమేంటనేది తెలుసుకునే ప్రయత్నేం చేస్తున్నామన్నారు.

    Murali Mohan

    ఉదయ్ కిరణ్ కేసు విషయంలో రెండు టీంలు పని చేస్తున్నాయని తెలిపారు. భార్య విషిత, అత్తమామలను డీటేల్డ్‌గా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మీడియాలో ప్రచారం జరిగినట్లుగా....ఉదయ్ కిరణ్ ఫోన్ నుంచి భార్య ఫోన్‌కు 'ఐ లవ్ యూ' అనే మెసేజ్ ఏమీ వెళ్లలేదని, భూపాల్ అనే వ్యక్తితో కూడా మాట్లాడలేదని డీసీపీ తెలిపారు.

    ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఉదయ్ కిరణ్ ఫోన్ నుండి మొత్తం 4 కాల్స్ వెళ్లాయని...అందులో రెండు కాల్స్ భార్య విషితకు, రెండు కాల్స్ శరత్ అనే కుర్రాడికి వెళ్లినట్లు తెలిపారు. శరత్ అనే వ్యక్తి విషితకు క్లాస్ మేట్ అని, ఫ్రెండ్ అని తమకు తెలిసిందని తెలిపారు.

    ఉదయ్ కిరణ్ చేతిపై గతంలో బ్లేడుతో కోసుకున్నట్లుగా గుర్తులు ఉన్నాయి. దీన్ని గతంలో ఆయన రెండు సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న రోజు విషిత అర్ధరాత్రి వరకు ఫ్రెండ్ రోహిత్ ఫంక్షన్‌కి వెళ్లిందని పోలీసులు తెలిపారు.

    ఆత్మహత్య జరిగిన 15 నిమిషాల్లోగా భార్య విషిత, అత్తమామలు సంఘటన స్థలానికి చేరుకున్నారని, ఉరి వేసుకున్న ఉదయ్ కిరణ్ బాడీని దించేసి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారని......ఈ కారణంగా సంఘటన స్థలంలో ప్రాథమిక ఆధారాల సేకరించే అవకాశం పోలీసులకు లేకుండా పోయిందని తెలిపారు.

    ఎలాంటి సూసైడ్ నోట్ తమకు లభించలేదని తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత ఏ విషయమనేది తేలుస్తామని డీసీపీ స్పష్టం చేసారు. తాజాగా మరో యాంగిల్ బయిటకు వచ్చింది. గతంలో ఉదయ్ కిరణ్ తో సినిమా చేసే నిమిత్తం ఓ హీరోయిన్ 15 లక్షలు పెట్టుబడి పెట్టిందట. ఆమె వచ్చి రీసెంట్ గా అతనిపై ఆ డబ్బు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేసిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని డిసిపీ మీడియాకు తెలియచేసారు.

    డీసీపీ మాట్లాడుతూ....గతంలో ఉదయ్ కిరణ్ వద్ద మేనేజర్ గా పనిచేసిన మున్నా నిర్మాతగా మారి డామిట్ కథ అడ్డం తిరిగింది సినిమా చెయ్యాలని మొదలెట్టారు. ఇందులో ఓ హీరోయిన్ కూడా 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మధ్యలో ఆగిపోవటంతో సదరు హీరోయిన్ వచ్చి ఉదయ్ కిరణ్ పై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై బుధవారం మున్నాని విచారిస్తాం అన్నారు.

    English summary
    Tollywood star Uday Kiran’s death, reports of caste domination by biggies in the industry is coming out in a big and unexpected way. Recently a TV panelist questioned MAA president Murali Mohan whether this is true for which Murali Mohan replied that he is not aware of how things are in here.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X