»   » సినిమాలోకం: కేసీఆర్, చంద్రబాబు ఒకేదారి (ఫోటో ఫీచర్)

సినిమాలోకం: కేసీఆర్, చంద్రబాబు ఒకేదారి (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా నటులు మురళీ మోహన్, రఘుబాబు పుట్టినరోజు వేడుకలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగాయి. ఈ సందర్భంగా ముళీ మోహన్ మాట్లాడుతూ 1973లో జగమేమాయ సినిమాతో నేను, గిరిబాబు ఇండస్ట్రీలోకి వచ్చాం. గిరిబాబు నాకు మంచి స్నేహితుడు. ఆయన తనయుడు రఘుబాబు పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడం ఆనందంగా ఉందని తెలిపారు. మెరళీ మోహన్ నాకు తండ్రి లాంటి వారని రఘు బాబు చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉత్తేజ్, కృష్ణుడు, మహర్షి, శశాంక్, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీ మోహన్, రఘుబాబులతో కేక్ కట్ చేయించారు. అనంతరం మురళీ మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్న గంధరగోళంపై వివరణ ఇచ్చారు.

తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ లోనే ఉంటుందని, ఎవరూ ఆందోలన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరూ అయోమయానికి గురి కాకుండా...ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులైన కేసీఆర్, చంద్రబాబులతో ప్రకటన చేయిస్తామని మురళీ మోహన్ తెలిపారు.

నిజం లేదన్న మురళీ మోహన్

నిజం లేదన్న మురళీ మోహన్

తెలుగు చలన చిత్ర పరిశ్రమ వైజాగ్ కు తరలిస్తున్నారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుగు చలన చిత్ర పరిశ్రమ నటీనటుల సంఘం అధ్యక్షుడు, ఎంపి మురళీ మోహన్ స్పష్టం చేశారు.

చెన్నై టు హైదరాబాద్

చెన్నై టు హైదరాబాద్

తెలుగు చలన చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కు రావటానికి 20 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఇక్కడి నుంచి వైజాగ్ కు తరలించాలంటే పెద్ద నటులకు సాధ్యమే, కానీ చిన్న తరహా నటీ నటులకు మాత్రం అది కష్ట సాధ్యమైన పని అన్నారు.

కేసీఆర్ సానుకూలం

కేసీఆర్ సానుకూలం

ఈ విషయంపై ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిశామని, ఆయన సానుకూలంగా స్పందించారని మురళీ మోహన్ వెల్లడించారు.

కేసీఆర్, చంద్రబాబుతో ప్రకటన

కేసీఆర్, చంద్రబాబుతో ప్రకటన

త్వరలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లను కూర్చో బెట్టి వారిద్దరి ద్వారా ఓ ప్రకటన కూడా చేపిస్తే ఇక ఎటువంటి సందేహాలు ఉండబోవని ఆయన తెలిపారు.

మురళీ మోహన్, రఘుబాబు

మురళీ మోహన్, రఘుబాబు

మురళీ మోహన్, రఘుబాబు పుట్టినరోజు వేడుకలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

English summary
Murali Mohan - Raghu Babu Birthday celebrations held at Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu