»   »  మెగస్టార్ సైరాకు న్యాయం చేయగలిగేది అతడే!

మెగస్టార్ సైరాకు న్యాయం చేయగలిగేది అతడే!

Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి, నయనతార మరియు జగపతి బాబు సహా ప్రధాన నటులంతా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. సైరా చిత్రానికి సంబంధించిన నిర్ణయం ఏదీ వెంటనే జరగడం లేదు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం కావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. హీరోయిన్ ఎంపిక విషయంలో చాలా మంది పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. చివరకు నయనతారని ఓకే చేసారు.

Music director Amit Trivedi in consideration for Sye Raa

సంగీత దర్శకుడి విషయంలో ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. మొదట ఏఆర్ రెహమాన్ ని అనుకున్నారు. కానీ రెహమాన్ అనుకోని కారణాల వలన ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత కీరవాణి పేరు వినిపించింది. తాజాగా బాలీవుడ్ సంగీత దర్శకుడు త్రివేది పేరు వినిపిస్తోంది. సైరా చిత్ర యూనిట్ అమిత్ త్రివేది గత చిత్రాలని పరిశీలించి ఇతడైతే సైరా చిత్రానికి న్యాయం చేయగలుగుతాడని భావిస్తున్నారట. సంగీత దర్శకుడి ఎంపీలలో ఇక తుది నిర్ణయమే మిగిలి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

English summary
Music director Amit Trivedi in consideration for Sye Raa. Movie team will finalize music director soon
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X