»   » సంగీత దర్శకుడు చక్రి ఇక పోలీస్ ఆఫీసర్

సంగీత దర్శకుడు చక్రి ఇక పోలీస్ ఆఫీసర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి త్వరలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. శ్రీకాంత్ హీరోగా చేస్తున్న రంగ...ది దొంగ చిత్రంలో ఈ విశేషం జరగనుంది. క్యారెక్టర్ జీవీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఈ పాత్ర కోసం మొదట చాలా మందిని అనుకున్నా చివరకు చక్రి అయితే బావుంటాడని భావించి ఎప్రోచ్ అయ్యారట. ఇంతకు ముందు సత్యం, ఎవడైతే నాకేంటి, ఆది లక్ష్మి, సత్యభామ చిత్రాల్లో గెస్ట్ గా కనపడ్డ చక్రి ఈ ఆఫర్ ని సంతోషంగా ఒప్పుకున్నాడని తెలుస్తోంది. కంటెన్యూగా సంగీతం అందిస్తున్న తనకీ ఈ నటన కాస్త రిలీఫ్ ని ఇస్తుందని భావిస్తున్నాడని అతని సర్కిల్ వారు చెప్తున్నారు.

శ్రీకాంత్ ఈ చిత్రంలో కేవలం పోలీసుల ఇళ్లల్లో మాత్రమే దొంగతనాలు చేసే పాత్రలో కనిపిస్తాడు. రెండు విభిన్నమైన పార్శ్వాలున్న పాత్ర పోషిస్తున్నాను అంటున్నారు శ్రీకాంత్. అలాగే "ఖడ్గం, ఆపరేషన్‌ దుర్యోధన, మహాత్మ చిత్రాల్లోని నా పాత్రలకు పూర్తి విరుద్ధమైన పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నాను. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో నా పాత్ర చాలెంజింగ్‌గా వుంటుంది. జీవి మంచి నటుడే కాదు దర్శకుడు కూడా అనే విషయం ఈ చిత్రంతో ప్రూవ్‌ అవుతుంది. కాన్ఫిడెంట్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మహాత్మ చిత్రంతో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న మనోహర్‌తో మరో సినిమా చేయడం ఆనందంగా వుంది' అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu