For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘చక్రి’పై విషప్రయోగం గొడవ: రంగంలోకి కేటీఆర్?

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: చక్రి మరణానికి నువ్వంటే నువ్వే కారణమంటూ అటు చక్రి భార్య శ్రావణి, ఇటు చక్రి తల్లి విద్యావతి పరస్పర పోలీసు ఫిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రావణి తన కుటుంబ సభ్యులతో కలిసి తన కొడుకును విషప్రయోగం చేసి చంపారని విద్యావతి ఆరోపిస్తోంది. తన భర్తను అత్తింటివారే విషప్రయోగం చేసి చంపేసారని శ్రావణి ఆరోపిస్తోంది. తాజాగా ఈ వివాదం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. చక్రి తల్లి, సోదరుడు ఆయన్ను కలవడమే ఇందుకు కారణం. మరి ఆయన జోక్యం చేసుకుంటారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.

  చక్రి మరణంపై విచారణ జరిపించాల్సిందిగా మంత్రిని వారు కోరారు. అనంతరం చక్రి సోదరి కృష్ణప్రియ మీడియాతో మాట్లాడుతూ చక్రి మరణంపై అనుమానాలు ఉన్నాయన్నారు. చక్రి మరణంపై త్వరగా విచారణ జరిపించాలని మంత్రి కేటీఆర్‌ను కోరామని కృష్ణప్రియ చెప్పారు. చక్రి మరణానికి అత్తింటి వారే కారణమని చక్రి భార్య శ్రావణి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మరునాడే చక్రి తల్లి సైతం పోలీసుస్టేషన్‌ మెట్లెక్కారు. చక్రి మృతికి ఆయన భార్య శ్రావణి కారణమని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చక్రి తల్లి, సోదరుడు, సోదరీమణులు మంత్రి కేటీఆర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  సంగీత దర్శకుడు చక్రి మరణం ఇంతకాలం సహజమైన గుండె పోటు మరణమనే అని అంతా అనుకుంటున్నాం. చక్రి హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని అపోలో ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించిన విషయం తెలిసిందే. కానీ ఆయన మరణం వెనక కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందనే వాదన తెరపైకి వచ్చింది. ఇది విని చక్రి అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. చక్రిది సహజ మరణంకాదని, అత్తింటి వారి ప్రమేయం ఉందనే అనుమానంతో చక్రి భార్య శ్రావణి.... నా కొడుకు మరణం వెనక భార్య ప్రమేయం ఉందనే అనుమానంతో చక్రి తల్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం హాట్ టాపిక్ అయింది.

  Music director Chakri family meets KTR

  చక్రి సహజంగానే మరణించాడా? లేక విష ప్రయోగంతో మరణించారా? అనే విషయాలను పక్కన పెడితే, మరణానికి ముందు చక్రి......భార్య, తల్లి మధ్య గొడవల కారణంగా నలిగిపోయారని, మనో వేదనకు గురయ్యారని స్పష్టం అవుతోంది. బయట ఎన్ని గొడవలున్నా ఇంట్లో ప్రశాంతత ఉంటే స్వర్గమే. కానీ చక్రి ఇంట్లోనే కొన్నాళ్లుగా ప్రశాంతత లేకుండా ఉన్నట్లు స్పష్టం అవుతోందని అభిమానులు అంటున్నారు.

  తనకు ఉన్న అనుమానాల గురించి భార్య శ్రావణి వివరిస్తూ.... 'చక్రి చనిపోయే ముందురోజు మా అత్తగారింట్లో భోజనం చేశారు. చక్రి చనిపోగానే విలువైన డాక్యుమెంట్లు, ఆభరణాలు తీసేసుకున్నారు. ఆయన మరణంపై అనుమానం ఉంది' అని ఆమె ఫిర్యాదు చేసారు. తన భర్త చనిపోగానే ఆయన కుటుంబ సభ్యులు తనను వేధించటం మొదలు పెట్టారని శ్రావణి చెప్పారు.

  అయితే చక్రి తల్లి విద్యావతి వాదన మరోలా ఉంది. ‘మావాడికి విషయం పెట్టినట్లు అనుమానం ఉంది. చనిపోయినపుడు శరీరం నల్లగా మారింది. పోలీసులతో పాటు పలువురికి అనుమానం వచ్చింది. కానీ వాళ్లూ వీళ్లూ మాట్లాడి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. ఇంటి నుంచి మేం బయటకు వెళ్లకపోతే చక్రిని చంపేస్తానని గతంలో ఆమె మమ్మల్ని బెదిరించింది. దాంతో మేం బయటకు వచ్చేశాం. ముందు రోజు రాత్రి ఒంటిగంటదాకా తన బావలతో మాట్లాడాడు చక్రి. తినమన్నా డైటింగ్ పేరు చెప్పి ఏమీ తినలేదు. ఇంటికెళ్లి ఏం తిన్నాడో ఏమో మాకు తెలియదు. మరుసటి రోజు చనిపోయాడని ఏడు గంటలకు ఫోన్ చేసింది. పోస్ట్ మార్టమ్ చేసుంటే నిజానిజాలు తెలిసేవి. కానీ అవేమీ చేయనివ్వకుండా మిగిలిన పనులు చేసేశారు. నాకు భర్త కూడా లేడు. నా బిడ్డలను చూసినా ఆమె ఓర్వలేదు. మా బాబు మరణంలో మాకు అనుమానాలున్నాయి. ఈ విషయాన్ని ముందే చెబుదామనుకుంటే పరువు బజారుపాలు కాకూడదని ఊరకున్నాం. కానీ మా బాబు పోయిన మూడో రోజు నుంచి మమ్మల్ని బజారు పాలు చేసింది' అని చెప్పారు.

  ఇరు వర్గాల ఫిర్యాదులను తీసుకున్న పోలీసులు కేసు విచారిస్తున్నారు. మరి ఏం తేలుస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఒక విషయం మాత్రం నిజం. చక్రి మరణం తర్వాత జరుగుతున్న ఈ పరిణామాల వెనక ఆస్తి వివాదాలు ఉన్నాయని మాత్రం స్పష్టం అవుతోంది. అయిన వాళ్ల కారణంగానే ఆయన ఊపిరి ఆగిపోయిందనేది వాస్తవం అని నమ్ముతున్నారు అభిమానులు.

  English summary
  Music director Chakri family meets KTR today.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X