»   » యువతి ఫిర్యాదు : చక్రి, నిర్మాత పరుచూరిపై కేసు

యువతి ఫిర్యాదు : చక్రి, నిర్మాత పరుచూరిపై కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Chakri
హైదరాబాద్ : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి, సినిమా నిర్మాత పరుచూరి ప్రసాద్‌పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫ్రెండ్షిప్ డే వేడుకల సందర్భంగా వీరు ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

వీరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు టీవీ ఛానల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. సంఘటన జరిగిన సమయంలో ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగిందనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు.

ఓ ప్రముఖ సంగీత దర్శకుడైన చక్రి ఇలాంటి కేసులో ఇరుక్కోవడం చర్చనీయాంశం అయింది. ఈ ఘటన‌పై చక్కి స్పందించాల్సి ఉంది. మరో వైపు ఈ వ్యవహారం చక్రి కుటుంబ సభ్యులు, అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. పోలీసులు విచారణ అనంతరం అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయి.

ఈ ఘటనపై స్పందించడానికి సినీ ప్రముఖులు ఎవరూ ముందుకు రావడం లేదు. పోలీసులు విచారణ పూర్తయ్యాకే దీనిపై వారు స్పందించే అవకాశం ఉంది. మరో వైపు చక్కిపై కేసు నమోదైన నేపథ్యంలో ఆయనతో సినిమాలు కమిటైన వారు కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

English summary
Music director Chakri in trouble. A young girl complains against Chakri and producer Paruchuri Prasad. Media reports said that the girl was abused by Chakri and Prasad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu