»   » మంచి మ్యూజిక్ రాకపోవడానికి కారణం హీరోలే.. మణిశర్మ టార్గెట్ పవన్, ఎన్టీఆర్, మహేశ్‌లేనా?

మంచి మ్యూజిక్ రాకపోవడానికి కారణం హీరోలే.. మణిశర్మ టార్గెట్ పవన్, ఎన్టీఆర్, మహేశ్‌లేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంగీత అభిమానులు, సినీ అభిమానుల మనసులను దోచుకొనే పాటలు రాకపోవడానికి కారణం హీరోలు మాత్రమే అని ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ట్రెండ్‌లో కాస్త వెనుకబడినట్టు కనిపిస్తున్న మణిశర్మ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తన అభిరుచి మేరకు సంగీతాన్ని అందించలేకపోతున్నానే ఆవేదనను వ్యక్తం చేశాడు.

జోరు తగ్గిన మణిశర్మ..

జోరు తగ్గిన మణిశర్మ..

గతంలో స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ లాంటి టాప్ హీరోలకు మ్యూజిక్ హిట్లను అందించిన మణిశర్మ ఇటీవల కాలంలో అంతగా జోరును ప్రదర్శించడం లేదు. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్, అమీతుమీ లాంటి సినిమాలకు మాత్రమే మ్యూజిక్ అందిస్తున్నారు. సంగీతపరంగా ఆయన మార్కు తెలుగు సినిమాలో కనిపించడం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

హీరోల వల్లే..

హీరోల వల్లే..

ప్రస్తుత జనరేషన్‌లో గుర్తుండిపోయే తెలుగుపాటలు రావడం లేదు. అందుకు కారణం స్టార్ హీరోలు మాత్రమే. హీరోలో తీరువల్లే తీన్‌మార్, శక్తి, ఖలేజా లాంటి సినిమాలకు మంచి సంగీతాన్ని అందించలేకపోయాను అని ఆయన వివరణ ఇచ్చారు. కాగా ఆయన ప్రస్తావించిన సినిమాలు ప్రముఖ హీరోలవి కావడం వివాదానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశం కనిపిస్తున్నది.

హీరోల అభిరుచికి తగినట్టుగా..

హీరోల అభిరుచికి తగినట్టుగా..

కొంతమంది హీరోలు మాస్ పాటలు కావాలని కోరుకొంటారు. కొంతమంది తమ డ్యాన్స్‌కు అనుగుణంగా ఉండేలా పాటలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. కథను, సన్నివేశాన్ని బట్టి కాకుండా హీరోల అభిరుచిలకు తగ్గట్టే ట్యూన్స్ కంపోజ్ చేయాలి. అందుకే తెలుగులో మంచి పాటలు రావడం లేదు అని మణిశర్మ అన్నారు.

కీరవాణి తర్వాత మణిశర్మ

కీరవాణి తర్వాత మణిశర్మ

బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ట్విట్టర్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరిచిపోతున్న నేపథ్యంలో మణిశర్మ వ్యాఖ్యలు మరోసారి సినీ వర్గాల్లో వేడి పుట్టించాయి. నేను నా కెరీర్లో ఎక్కువగా బుర్రలేని చాలామంది దర్శకులతో నేను పనిచేశాను. వారు నా మాటలు వినేవారు కాదు. అంతే కాకుండా వేటూరి, సిరివెన్నెల తర్వాత తెలుగు సినిమా సాహిత్యం అంపశయ్య పై ఉంది అంటూ గీత రచయితలపైనా కీరవాణి సంచలన కామెంట్స్ చేసారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కీరవాణిపై ప్రముఖ గీత రచయితలు రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్‌లు మండిపడిన సంగతి తెలిసిందే. తాజాగా మణిశర్మ వ్యాఖ్యలపై హీరోలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

English summary
Music Director Mani sharma made some comments on Tollywood Heroes. He said because of Heroes.. I am not delivering good music recent days. That reason I have not given good music for Teenmaar, Khaleja, Shakti movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu