»   »  తెలుగు సంగీత దర్శకుడిపై దాడి, తీవ్ర గాయాలు

తెలుగు సంగీత దర్శకుడిపై దాడి, తీవ్ర గాయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సంగీత దర్శకుడు శశిప్రీతమ్ మీద శుక్రవారం దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే రక్తమోడుతున్న పరిస్థితుల్లోనే శశి ప్రీతం నేరుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసారు. తనపై భాను ప్రసాద్ అనే వ్యక్తి దాడి చేసినట్లు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

శశి ప్రీతమ్, భాను ప్రసాద్ ఎదురెదురు ఫ్లాట్లలోనే ఉంటున్నారు. ఇద్దరి మధ్య గత కొంత కాలంగా ఘర్షణ వాతావరణం ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలో శుక్రవారం కారు దిగి ఇంట్లోకి వెలుతున్న సమయంలో శశి ప్రీతమ్ మీద దాడి జరిగనట్లు తెలుస్తోంది. అయితే దాడి ఎందుకు జరిగింది అనేది తెలియాల్సి ఉంది.

Music Director Sasi Preetam Attacked

ఇద్దరి మధ్య గొడవ జరుగడానికి కారణం ఏమిటి? అసలు భాను ప్రసాద్ ఎవరు? దాడి వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భాను ప్రసాద్ తనపై గతంలోనూ దాడి చేసినట్లు శశి ప్రీతమ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

శశి ప్రీతమ్ తెలుగులో గులాబీ, రాఘవ, కార్తీక్, నా ప్రాణం కంటే ఎక్కువ తదితర సినిమాలకు సంగీతం అందించారు. దీంతో పలు చిత్రాలకు ప్లే బ్యాక్ సింగర్ గా పాటలు పాడారు.

English summary
Music Director Sasi Preetam is attacked by a person named Bhanu when the former was driving a car. As per the reports, Bhanu was staying in an apartment in front of Sasi Preetam's apartment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu