»   » సంగీత దర్శకుడు 'శ్రీ' కన్నుమూత

సంగీత దర్శకుడు 'శ్రీ' కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శ్రీ (49) కన్నుమూశారు. కొంతకాలంగా మూత్ర పిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి కొండాపూర్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. శ్రీ పూర్తి పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి. నిన్నటితరం సంగీత దర్శకుడు చక్రవర్తి తనయుడే ఈయన. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 'పోలీస్‌ బ్రదర్స్‌'తో స్వరకర్తగా తన సినీ ప్రయాణాన్ని ఆరంభించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సంగీత దర్శకుడుగా...

'మనీ మనీ', 'లిటిల్‌ సోల్జర్స్‌', 'సింధూరం', 'అనగనగా ఒకరోజు', 'ఆవిడా మా ఆవిడే', 'గాయం', 'అమ్మోరు', 'నా హృదయంలో నిదురించే చెలి', 'చంటిగాడు', 'నీకే మనసిచ్చాను', 'కాశి' తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల 'సాహసం', 'ఆడు మగాడ్రా బుజ్జి', 'చందమామలో అమృతం' చిత్రాలకు పనిచేశారు. 'అప్పు' అనే చిత్రం విడుదల కావాల్సి ఉంది.

Music Director Sri No More

నేపధ్యగాయకుడుగా, అనువాద కళాకారుడిగా...

సంగీత దర్శకుడిగానే కాకుండా నేపథ్య గాయకుడిగా, అనువాద కళాకారుడిగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు శ్రీ. 'చక్రం' సినిమాలో 'జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది' అనే గీతాన్ని శ్రీనే ఆలపించారు. రామ్‌గోపాల్‌వర్మ, కృష్ణవంశీ వంటి అగ్ర దర్శకులు శ్రీ గళాన్ని, ఆయన బాణీల్ని ఎంతో ఇష్టపడుతుంటారు. 'చక్రం'తో పాటు 'అనగనగా ఒక రోజు', 'గాయం', 'అమ్మోరు', 'సింధూరం' తదితర చిత్రాల్లోనూ పాటలు ఆలపించారు. సంగీత దర్శకుడిగా శ్రీ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రతీ చిత్రంలోనూ ఒక్క పాటైనా ప్రాచుర్యం పొందేది. శ్రోతలు పదేపదే పాడుకునేలా ఆ పాటలు ఉంటాయి.

'అనగనగా ఒక రోజు' చిత్రలో 'మా ఫ్రెండు చెల్లెల్ని కొందరు ఏడిపించారు..' అనే పాట శ్రీ శైలిని చాటి చెబుతుంది. మామూలు మాటల్ని సైతం పాటగా ఎలా చేయొచ్చో ఆ పాటతో చూపించారు శ్రీ. అంతకుముందు ఆత్రేయ పాటలకు కె.వి.మహదేవన్‌లాంటి సంగీత దర్శకులు మాత్రమే అలాంటి ప్రయోగం చేసేవారు. అనువాద కళాకారుడిగా కూడా పలు చిత్రాలకు పనిచేశారు శ్రీ. '143'లో సాయిరామ్‌ శంకర్‌కి డబ్బింగ్‌ చెప్పారు.

ప్రెవేట్ ఆల్బమ్...

గాయని స్మితతో కలిసి 'హాయ్‌ రబ్బా' అనే ప్రైవేట్‌ ఆల్బమ్‌ని రూపొందించారు. ఆయనకి ఓ కొడుకు రాజేష్‌ చక్రవర్తి ఉన్నారు. సంగీత దర్శకుడిగా పలు విజయాలు సొంతం చేసుకున్న శ్రీకి మధ్యలో విరామం వచ్చింది. తన తల్లి మరణం ఎంతో కుంగదీసిందని చెప్పేవారు ఆయన.

శ్రీ మరణం పట్ల పలువురు సిని ప్రముఖులు తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. వన్ ఇండియా తెలుగు శ్రీ మృతికి సంతాపం తెలియచేస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తోంది.

English summary
Music director Srinivasa Chakravarthy, popularly known as Sri died here on Saturday. He was ailing for the past few months and breathed his last on Saturday. Sri was the son of yesteryear’s renowned music director Chakravarthy. He made his debut as music director in a movie titled ‘Police Brothers’.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu