twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇళయరాజా బర్త్ డే స్పెషల్: తుఫానులో కూడా ఆయన సంగీతమే, యువత ఊగిపోయారు!

    |

    మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా పేరు వినని సంగీత ప్రియులు, సినిమా అభిమానులు ఉండరు. ఐదు దశాబ్దాల కాలంగా ఇళయరాజా సంగీతం అలరిస్తూనే ఉంది. ముఖ్యంగా 70, 80, 90 దశకాలలో ఇళయరాజా సంగీతం అంటే చెవికోసుకునేవారు. ఆ సమయంలో ఆయన పాటలు ఒక ఊపు ఊపాయి. తెలుగులో కూడా ఆయన వందలాది చిత్రాలకు ఆణిముత్యాల్లాంటి పాటలు అందించారు. మెగాస్టార్ చిరంజీవి,విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించారు. ఐదు దశాబ్దాలుగా అలుపెరగకుండా సంగీతం అందిస్తున్న ఇళయరాజా 75 వ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన సంగీతం అందించిన తెలుగు చిత్రాలని గుర్తు చేసుకుందాం.

    Recommended Video

    ఇళయరాజా 'కులం'పై సంచలన కథనం అవార్డుకు కారణమదేనంటూ ?
     జగదేక వీరుడు అతిలోక సుందరి

    జగదేక వీరుడు అతిలోక సుందరి

    80, 90 దశకాలలో సినిమా ప్రచారాలకు ఇన్ని పద్ధతులు ఉండేవి కావు. పాటలు వినైనా సినిమాకు వెళ్ళాలి, లేదా ఎక్కడైనా పోస్టర్ చూసైనా వెళ్ళాలి.1990 లో మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన అద్భుత దృశ్య కావ్యం జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం విడుదలయింది. విడుదల సమయంలోనే హోరున తుఫాను ఆంధ్ర ప్రదేశ్ లో మొదలైంది. అప్పటికే విడుదలైన ఇళయరాజా పాటలు దుమ్ము రేపుతున్నాయి. ఇళయరాజా పాటలు అందించిన ఉత్సాహంతో జనాలు తుఫానుని కూడా లెక్కచేయకుండా ఆ చిత్రాన్ని ఆదరించి అఖండ విజయం అందించారు.

     చంటి

    చంటి

    నటనలో విక్టరీ వెంకటేష్ ని మరో స్థాయికి చేర్చిన చిత్రం చంటి. మీనా, వెంకటేష్ జంటగా నటించారు. ఇళయరాజా ఈ చిత్రానికి అందించిన క్లాసికల్ మ్యూజిక్ ఎప్పటికి మరచిపోలేము.

    రుద్రవీణ

    రుద్రవీణ

    అద్భుతమైన సోషల్ మెసేజ్ తో వచ్చిన చిరంజీవి రుద్రవీణ చిత్రానికి కూడా ఇళయరాజా అందమైన సంగీతాని అందించారు. ఈ చిత్రంలోని 'నమ్మకు నమ్మకు ఈ రేయిని' సాంగ్ ఇళయరాజా ఆల్ టైం బెస్ట్ సాంగ్స్ లో ఒకటి.

    సీతాకోక చిలుక

    సీతాకోక చిలుక

    1981 లో విడుదలైన సీతాకోక చిలుక చిత్రం అద్భుతమైన ప్రేక కథగా నిలిచింది. అప్పట్లో యువతని ఈ చిత్రం ఉర్రుతలూగించింది. ఈ ప్రేకకథలోని ఎమోషన్ కు అనుగుణంగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా మాస్టర్ పీస్ లాంటి ఆల్బమ్ ని అందించారు.

    నిర్ణయం

    నిర్ణయం

    నాగార్జున, అమల జంటగా నటించిన నిర్ణయం చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో 'హాలోగురు ప్రేమ కోసమే జీవితం' అనే సాంగ్ ఆల్ టైమ్ బెస్ట్ టీజింగ్ సాంగ్ గా నిలిచింది.

     బొబ్బిలి రాజా

    బొబ్బిలి రాజా

    విక్టరీ వెంకటేష్ కెరీర్ లో మరచిపోలేని మాస్ యాక్షన్ చిత్రం బొబ్బిలి రాజా. ఈ చిత్రానికి కూడా ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించారు.

    గీతాంజలి

    గీతాంజలి

    మణిరత్నం దర్శకత్వం వచించిన గీతాంజలి చిత్రం ఓ క్లాసికల్ మూవీ. మణిరత్నం దర్శకత్వానికి తోడు ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఎమోషనల్ లవ్ స్టోరీకి అదేస్థాయిలో ఇళయరాజా సంగీతం అందించారు.

    అభిలాష

    అభిలాష

    అభిలాష చిత్రం 1983లో విడుదలైంది. అప్పుడప్పుడే చిరంజీవి స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. ఉత్కంఠ భరితమైన థ్రిల్లర్ కథతో వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇళయరాజా అందించిన ఆణిముత్యాల్లాంటి పాటలని సంగీత ప్రియులు ఇప్పటికీ వింటూనే ఉంటారు.

     అభినందన

    అభినందన

    ఇళయరాజా సంగీతం అందించిన అభినందన చిత్రం పెద్ద మ్యూజికల్ హిట్ గా నిలిచింది. 1987 లో ఈ చిత్రం విడుదలయ్యింది.

    సాగరసంగమం

    సాగరసంగమం

    కమల్ హాసన్, జయప్రద నట విశ్వరూపం ప్రదర్శించిన సాగరసంగమం చిత్రం గురించి, అందులోని సాంగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కమల్ హాసన్ కెరీర్ లో మెమరబుల్ మూవీ ఇది. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

    English summary
    Music maestro Ilayaraja birthday. Here is the 10 best albums of Ilayaraja
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X