»   » అబ్బో...కూతురు మీద ఆవిడకు ఎంత నమ్మకమో!

అబ్బో...కూతురు మీద ఆవిడకు ఎంత నమ్మకమో!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Akshara
ముంబై: మాజీ నటి సారిక తన రెండో కూతురు అక్షర్ హాసన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటంపై ఎంతో సంతోషంగా ఉంది. అయితే తన కూతురుకు పరిశ్రమలో ఎలా పైకి రావాలనే విషయమై ఎలాంటి టిప్స్ చెప్పబోనని అంటోంది. ఎందుకంటే తన కూతురు తనదైన సొంత స్టైల్‌లో దూసుకెలుతుందనేనమ్మకం వ్యక్తం చేస్తోంది సారిక.

ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ...'ప్రతి జనరేషన్ వారి వారి సొంత అభిరుచులు, వర్కింగ్ స్టైల్ కలిగి ఉంటారు. మన అభిప్రాయాలు వారిపై రుద్దడం సరికాదు. సినిమా రంగాన్ని వారికి పరిచయం చేయడం మాత్రమే మన బాధ్యత. నా కూతురు తప్పకుండా తనదైన సొంత స్టైల్లో ఈ రంగంలో సత్తా చాటుతుందనే నమ్మకం నాకు ఉంది. అక్షర తెరంగ్రేటానికి ఇదే మంచి సమయం. నా ఇద్దరు కూతుర్లు శృతి హాసన్, అక్షర్ హాసన్‌ల విషయంలో నేను పూర్త సంతృప్తిగా ఉన్నాను' అని సారిక చెప్పుకొచ్చారు.

అక్షర హాసన్ ఆర్‌.బల్కి రూపొందించబోతున్న ఓ హిందీ సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఎంపికయింది. ధనుష్ సరసన హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. దర్శకుడు బాల్కితో అమితాబ్ బచ్చన్, ఇళయారాజా కలిసి పని చేయడం ఇది మూడో సారి.

అక్షర కూడా తన అక్క శృతి మాదిరిగానే సినీ పరిశ్రమలో ఏ శాఖ ఎంచుకోవాలన్న విసయమై చాలా కాలం తర్జనభర్జన పడింది. మొదట్లో శృతి గాయనిగా, సంగీత దర్శకురాలిగా రాణించాలని అనుకుని, ఆ తర్వాత నటనను వృత్తిగా ఎంచుకోవడం విశేషం. ఇక అక్షర కూడా హీరోయిన్‌గా, రచయిత్రిగా, దర్శకురాలు అనే మూడు అప్షన్లు పెట్టుకుని....చివరకు హీరోయిన్ ఆప్షన్‌ను ఫైనల్‌గా ఎంచుకుంది.

English summary
Veteran actress Sarika is excited about her younger daughter Akshara Hassan's acting debut. But the star mom doesn't want to share any tips with her as she believes the latter should find her own way.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu