»   » నాన్నపై సానుభూతి చూపొద్దు: నాగార్జున

నాన్నపై సానుభూతి చూపొద్దు: నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 90 ఏళ్ల వయసులో క్యాన్సర్ బారిన పడటం, క్యాన్సర్ కణాలను తొలగించడంలో భాగంగా వైద్యులు ఆయనకు సర్జరీ చేయడం తెలిసిందే. సర్జరీ తర్వాత నాన్నగారు వేగంగా కోలుకుంటున్నారని అక్కినేని నాగార్జున అన్నారు. నాన్నగారి ఆరోగ్యం విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో ఆయనపై అభిమానం చూపండి కానీ....సానుభూతి చూపొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసారు.

 My Father ANR's Positive Spirit Helping Him Recover Faster: Nagarjuna

'సర్జరీ తర్వాత ఆయన ఇంత త్వరగా కోలుకోవడంతో మేం ఎంతో థ్రిల్ ఫీలయ్యాం. జనవరి 1న మా ఫ్యామిలీ మొత్తం ఆయనతో ఎంతో సంతోషంగా గడిపాం. ఆయన ఎంతో పాజిటివ్ స్పిరిట్‌తో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం మీడియాతో తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన స్వయంగా మాట్లాడటమే ఇందుకు నిదర్శనం. ఉత్సాహంగా ఉండటానికి తనకు ఇష్టమైన పనులు పనులు చేస్తున్నారు. టీవీల్లో తన ఫేవరెట్ కామెడీ షోలు చూస్తున్నారు. ఫేవరెట్ పాటలు వింటున్నారు. తనకు ఇష్టమైన సినిమాలు కూడా చూస్తున్నారు. ఇటీవల వచ్చిన 'ఉయ్యాల జంపాల' సినిమా కూడా చూసారు' అని నాగార్జున చెప్పుకొచ్చారు.

అభిమానుల, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మీడియా సపోర్ట్ వల్లే ఆయన కోలుకున్నారని, ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు నాగార్జున చెప్పుకొచ్చారు. తన సుధీర్ఘ సీనిమా కెరీర్లో నాగేశ్వరరావు ఇప్పటి వరకు దాదాపు 250 సినిమాల్లో నటించారు. 1944లో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన తెలుగు సినిమా జగతిని ఏలిన అగ్రనటుల్లో ఒకరు. ఇప్పటికీ ఆయన సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం 'మనం' చిత్రంలో నటిస్తున్నారు.

English summary
Actor Akkineni Nagarjuna says his father Akkineni Nageswara Rao's will to live has helped him recover faster after his surgery to cure intestinal cancer. The 90-year-old legendary actor was diagnosed with cancer in October last year. He had shared the news with fans and requested them not to show sympathy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu