»   » నాన్న నా పెళ్లిని కోరుకోవడం లేదు, హీరోయిన్ ప్రకటన

నాన్న నా పెళ్లిని కోరుకోవడం లేదు, హీరోయిన్ ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రతి తండ్రి తన కూతురుని ఒక మంచి అబ్బాయికి ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి అత్తారింటికి సాగనంపాలని కోరుకుంటాడు. ప్రతి తండ్రి జీవితంలో ఇదొక ముఖ్యమైన లక్ష్యం. కానీ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ విషయంలో మాత్రం ఇది పూర్తిగా భిన్నం. అలియా భట్ తండ్రి, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అయిన మహేష్ భట్ తన కూతురు పెళ్లి జరుగాలని అసలు కోరుకోవడం లేదట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అలియా భట్ మాట్లాడుతూ....తన తండ్రి గురించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'మా పట్ల ఆయన చాలా స్వాధీనతా భావంతో ఉంటారు. మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. నేను పెళ్లి చేసుకుని వెళ్లడం ఆయనకు ఇష్టం లేదు. ఈ విషయాన్ని ఆయన నిర్మొహమాటంగా మాతో చెబుతారు' అని వెల్లడించింది.

 Alia Bhatt

అలియా భట్ ప్రస్తుతం '2 స్టేట్స్' అనే చితరంలో నటిస్తోంది. యూటీవీ మోషన్ పిక్చర్స్ సమర్పణలో సాజిద్ నడియావాలా, కరణ్ జోహార ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో అర్జున్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ డ్రామా నేపత్యంలో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2009లో చేతన్ భగత్ రాసిన '2 స్టేట్స్' అనే నవల ఆధారంగా అదే పేరుతో ఈచిత్రాన్ని రూపొందించారు.

ఏప్రిల్ 18, 2014న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అర్జున్ కపూర్, అలియా భట్‌తో పాటుగా....అమృత సింగ్, రేవతి, రోనిత్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శంకర్-ఎస్సాన్-లాయ్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

English summary
It is said every father dreams about arranging his daughter's marriage some day, but the saying does not hold good for actress Alia Bhatt's father, Mahesh Bhatt who doesn't want his daughters to get married.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu