»   » వాళ్ళ నాన్నని కొడుతుంటే మహేష్ బాబు అల్లుళ్ళు భరించలేకపోయారట

వాళ్ళ నాన్నని కొడుతుంటే మహేష్ బాబు అల్లుళ్ళు భరించలేకపోయారట

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక నాటి సూపర్ స్టార్ మేనల్లుడు గా నేటి సూపర్ స్టార్ మహేష్ బాబుకి బావగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సుధీర్ బాబు. తెలుగులో కాస్త తడబడ్డా ఇప్పుడు బాలీవుడ్ వరకూ తన బావ మహేష్ కంటే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ లో విలన్ గా అడుగుపెట్టి అరంగేట్రంలోనే బాఘీ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు ఈ టాలీవుడ్ హీరో. అక్కడ ఇప్పుడు సుధీర్ బాబు చిన్న నిర్మాతలకి మంచి చాయిస్ గా మారాడు.

ఇది తనకు కొత్త ఎక్స్ పీరియన్స్ అయినా నేషనల్ స్థాయి ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకోవటం అంటే మాటలు కాదు. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కొచ్చి పడింది సుధీర్ బాబుకి ఇక్కడ విలన్లను చితక్కొట్టిన కేరక్టర్ చేసి అక్కడికెళ్లి తన్నులు తినాల్సి వచ్చింది. ఎంత బాడీ పెంచినా విలన్ అన్నాక దెబ్బలు తినాల్సిందే కదా లేదంటే కథా,ప్రేక్షకులూ ఒప్పుకోరు. అయితే పిల్లలకు ఇవేమీ తెలియదు కదా..!

భాగీ చూసిన సుధీర్ బాబు పిల్లలు మాత్రం తమ తండ్రిని కొడుతుంటే తట్టుకోలేకపోయారట. తన వరకూ తాను నటనలో పాజిటివ్ - నెగిటివ్ ఏ కేరక్టర్ అయినా సరే ఎలా చేశానన్నదే ముఖ్యం తన కు వచ్చిన పాత్రకి పూర్తి స్థాయి న్యాయం చేసామా లేదా అన్నడే పట్టుఇంచుకుంటాడు కానీ పిల్లలకేం తెలుసు.

My kids didn't like me getting hit : Sudheer babu

దెబ్బలూ,రక్తం కారే గాయాలతో తమ తండ్రిని చూసి పిల్లలు మాత్రం చూడలేకపోయినట్లు చెప్పాడు సుధీర్ బాబు. అయితే. ఎటువంటి రిప్రజెంటేషన్స్ రికమెండేషన్స్ లాంటివి లేకుండా. తనకు తానుగా ఈ ఆఫర్ దక్కించుకుని ఇప్పుడు విజయం సాధించడంతో. భార్య మాత్రం సంతోషంగానే ఫీలయ్యిందట.

"నా పిల్లలు ఇద్దరు కుమారులు వారి స్నేహితుల మధ్య బోలెడన్ని మాటలు జరిగినట్లు చెబుతున్నారు. వారి ఫ్రెండ్స్ లో తోటి హీరోల పిల్లలు కూడా ఉన్నారు. నేను దెబ్బలు తిన్నట్లుగా నటించడం వారికి నచ్చదు. అయితే ఈ కేరక్టర్ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను.

"బాఘీ" ఆడిషన్ కి వెళ్లినపుడు ఇద్దరు సూపర్ స్టార్ ల కుటుంబం నుంచి వచ్చిన విషయం కూడా బాఘీ యూనిట్ కి తెలియదు" అంటున్నాడు సుధీర్ బాబు. పీలల సంగతి సరే ఎంత బావ అయినా "సూపర్ శ్తార్" అనిపించుకున్న వ్యక్తిగా మహేష్ ఇచ్చిన కాంప్లిమెంట్ చాలానే ఆనందాన్నిచ్చిందట.

English summary
They didn’t like this one because I got hit and they feel bad about that said Sudheer babu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu