»   » శశికళపై వర్మ సినిమా, జయలలిత రహస్యాలన్నీ బయట పెడతాడా?

శశికళపై వర్మ సినిమా, జయలలిత రహస్యాలన్నీ బయట పెడతాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కాంట్రవర్సల్ రియల్ లైఫ్ స్టోరీలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మను మించినోడు లేడనే చెప్పాలి. ఇప్పటికే పలు వివాదాస్పద స్టోరీలను తెరకెక్కించిన వర్మ.... తాజాగా మరో ప్రకటన చేసారు.

RGV

తన తదుపరి సినిమా పేరు 'శశికళ' అని ప్రకటించాడు. శశికళ అనే పేరుతో ఓ ఫిక్షనల్ డ్రామాను తెరకెక్కించనున్నానని... ఓ రాజకీయ నాయకురాలి ప్రియ స్నేహితురాలి జీవితం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ట్విట్టర్లో వర్మ తెలిపాడు. అంతే కాదు ఇప్పటికే ఈ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారట.

జయలలిత, శశికళ బంధం గురించి....అందరికీ తెలిసిందే. మరి సినిమా ద్వారా జయటి ప్రపంచానికి జయలలిత గురించి తెలియని విషయాలు వర్మ చెప్పబోతున్నారా? లేక ఇంకేమైనా సంచలన విషయాలు ఈ సినిమాలో చూపించబోతున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది.

చివరగా వర్మ తన ట్విట్టర్లో....జయలలిత అంటే తనకు గౌరవమని, శశికళ అంటే అంతకుమించిన గౌరవమని వర్మ ట్వీట్ చేయడం విశేషం. ఒక వేళ వర్మ కనుక ఈ సినిమా మొదలు పెడితే అదో సంచలన సినిమాగా మారడం ఖాయం.

English summary
"Just registered my new film title "Shashikala" it's the story of a very dearest closest friend of a politician and completely fictional" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu