»   »  '1 నేనొక్కడినే' లో సిక్స్ ప్యాక్ విషయమై మహేష్ బాబు

'1 నేనొక్కడినే' లో సిక్స్ ప్యాక్ విషయమై మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ తాజా సినిమా '1 నేనొక్కడినే' సినిమా సంక్రాంతి విడుదలకు ముస్తాబు అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో మహేష్ బాబు సిక్స్ ప్యాక్ తో కనపడనున్నాడనే వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందుకోసం మహేష్ బాబు ట్రైనర్స్ ని పెట్టుకుని మరీ బాడీ షేప్ పెంచుకున్నారు. అయితే ఈ చిత్రంలో మహేష్ సిక్స్ ప్యాక్ బాడీ ని చూపించడని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన నేషనల్ డైలీతో మాట్లాడుతూ వివరించారు.

మహేష్ బాబు మాట్లాడుతూ...చిత్రంలో ఉన్న రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఎక్సట్రీమ్ ఫిట్ నెస్ కావాల్సి వచ్చింది. పీటర్ హెయిన్స్ నేపధ్యంలో బిల్డింగ్ ల మీద నుంచి జంప్ చేయటం,కొన్ని ఫైట్స్ కోసం ఈ బాడీని బిల్డప్ చేయాల్సి వచ్చింది అన్నారు. అంతేగానీ చొక్కా విప్పతీసి మరీ సిక్స్ ప్యాక్ ని చూపించే ప్రసక్తి లేదు అన్నారు.

మరో ప్రక్క అదే ఇంటర్వూలో ఈ చిత్రంలో వివాదంగా మారిన పోస్టర్ విషయమై వివరణ ఇచ్చారు. మహేష్ మాట్లాడుతూ..ఈ విషయంపై సారి చెప్పారు. మహేష్ మాట్లాడుతూ...." కొంత సేపు ఫిషింగ్ చేద్దామా అంటూ పాటలో వచ్చే లిరిక్ కోసం చేసింది ఇది. అంతే తప్ప జనాలు అనుకున్నట్లుగా మేము ఊహించి చెయ్యలేదు. ఈ విషయమై ఎవరన్నా హర్ట్ అయితే సారీ. సినిమాలో ఆ పాటని చూసినప్పుడు తప్పకుండా మీరు మనస్సు మార్చుకుంటారు. " అన్నారు.

ఈ పోస్టర్‌పై హీరోయిన్ సమంత మండిపడిన విషయం తెలిసిందే. ఈ సినిమా మహేష్ బీచ్‌లో నడుస్తుండగా హీరోయిన్ తన పాద ముద్రలను తాకుతూ పాకుతున్న పోస్టర్ మీద సమంత చేసిన కామెంట్స్‌కు మహేష్ ఫ్యాన్స్ సమంత మీద ఎదురుదాడి దిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై మహేష్ వివరణ ఇచ్చారు. ఇక దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా సమంతను సపోర్ట్ చేస్తూ కొత్తగా వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ వివాదం చెలరేగుతోంది. దీనితో ఆయనపై కూడా మహేష్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు.

English summary
Speaking to a National tabloid, Mahesh shared he has undergone training to keep himself extremely fit as there are several risky action sequences in the movie. For one of the sequences, our Prince even jumped from a building and the action part was supervised by Peter Heins. Hopefully, the effort put in by Mahesh will give goosebumps to the audience while watching the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu