»   » మిస్టరీ: ఉదయ్ కిరణ్, సిల్క్ స్మిత...ఎందరో (ఫోటో ఫీచర్)

మిస్టరీ: ఉదయ్ కిరణ్, సిల్క్ స్మిత...ఎందరో (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారాబాద్ : వారంతా సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగిన తారలు. తమ అద్భుతైన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నా స్టార్స్. పరిశ్రమలో అగ్ర స్థానంలోకి దూసుకెళ్లే క్రమంలో ఉన్నట్టుండి మృత్యువు ఒడిలోకి జారి పోయారు. వారి మరణం వెనక కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.

వారిలో కొందరు ఆత్మహత్య చేసుకుంటే...మరికొందరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వీరు ఆకస్మికంగా తనువు చాలించడం వెనక కొన్ని అదృశ్య శక్తుల ప్రేమయ ఉందని అప్పట్లో ప్రచారం జరుగడం అభిమానులను కలవర పెట్టింది. అయితే వీరి మరణం వెనక ఉన్న రహస్యాలను వెలికి తీసేందుకు ఎన్ని విచారణలు జరిగినా.....ఫలితం శూన్యం.

అలాంటి కొందరు సినీ స్టార్లకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో.....

సిల్క్ స్మిత

సిల్క్ స్మిత

ఏలూరుకు చెందిన విజయలక్ష్మి సినిమాల్లోకి వచ్చి సిల్క్‌స్మితగా మారిపోయింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అనుకోకుండానే నటనారంగంలోకి రావాల్సివచ్చింది. సమీపబంధువుతో కలసి చెన్నై వెళ్ళిన విజయలక్ష్మిని ఓ ఫ్లోర్‌ మిల్లులో చూసిన దర్శకుడు వినుచక్రవర్తి ఆమెచే సినీరంగ ప్రవేశం చేయించారు. ఓ సినిమాలో ఆమె చేసిన పాత్ర సిల్క్‌‌కు మంచి పేరు రావడంతో సిల్క్ స్మిత అనే పేరునే తన స్క్రీన్ నేమ్‌గా మార్చుకుంది. తమిళం‌, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె శృంగార తారగా ఎదిదింది. కెరీర్ బాగా సాగుతున్న తరుణంలో 35వ ఏట ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, ఓ స్టార్‌తో ప్రేమాయణమే ఆమె మరణానికి కారణం అనే వార్తలు అప్పట్లో వినిపించాయి.

ఉదయ్ కిరణ్

ఉదయ్ కిరణ్

‘చిత్రం' సినిమాతో చిన్న వయసులోనే హీరోగా తెరంగ్రేటం చేసిన ఉదయ్ కిరణ్ తొలి చిత్రంతోనే హిట్ కొట్టాడు. తెరంగ్రేటంతోనే వరుసగా మూడు హిట్ చిత్రాల్లో నటించి హాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస పరాజయాలు చవి చూసిన ఉదయ్ కిరణ్ 33 ఏళ్ల వయసులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిశ్రమలోని కొన్ని శక్తులు అతని కెరీర్‌తో చెలగాటం ఆడటం వల్లనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడనే వార్తలు అప్పట్లో ప్రచారంలోకి వచ్చాయి.

దివ్యభారతి

దివ్యభారతి

దివ్యభారతి పేరు చెప్పగానే బొబ్బిలి రాజా సినిమా గుర్తుకు వస్తుంది. 19ఏళ్ళ వయస్సులోనే తనువు చాలించింది. దక్షిణాది సినిమాల్లో సంచలన విజయాలు సాధించి బాలీవుడ్‌ లోనూ నటించింది. ఆమె కెరీర్‌ మరిం త ఉన్నతస్థాయికి చేరుకుంటున్న తరుణంలో ఐదంతస్తుల భవనం పై నుంచి పడి మరణించింది. భర్త సాజిద్‌ నడియావాలాతో గొడవపడి ఆమె ఆత్మ హత్య చేసుకున్నట్లుగా భావిస్తారు. అతిపిన్న వయస్సులోనే సినిమారంగంలో అమితంగా పేరుప్రఖ్యాతులు సాధించిన తారల్లో దివ్యభారతిని ప్రముఖంగా చెప్పవచ్చు.

ప్రత్యూష

ప్రత్యూష

2002లో ఫిబ్రవరి 23న నటి ప్రత్యూష అనుమానాస్పద మైన పరిస్థితుల్లో మరణించింది. ఆమె మరణం సంఘట వెనుక కొందరు 'పెద్ద మనుషుల' ప్రమేయం ఉందనీ, ఆ కేసు ను లోతుగా పరిశోధన చేస్తే అన్ని వివరాలూ బయటపడతాయని ప్రత్యూష తల్లి అప్పట్లో పోరాటం చేసింది.

మీనా కుమారి

మీనా కుమారి

బాలీవుడ్ నటి మీనాకుమారి అసలు పేరు మహజాబీన్‌ బానో. నటి మాత్రమే గాకుండా చక్కటి కవయిత్రి కూడా. 30 ఏళ్ళ సినిమా కెరీర్‌లో సుమారు 100 సినిమాల్లో నటించారు. ఆ చిత్రాల్లో ఎన్నో నేటికీ క్లాసిక్స్‌గా నిలిచాయి. పాకీజా, బైజు బావ్రా, దో బిగా జమీన్‌, బాందిష్‌, బంధన్‌, సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌, కోహినూర్‌ వంటి చిత్రాలు ఆమెకు పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. అవన్నీ ఆమె నటజీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాయి. పాకీజా విడుదలైన మూడు వారాలకు తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. మరణించినప్పుడు ఆమె వద్ద చిల్లిగవ్వ కూడా లేదని చెబుతారు.

స్మితా పాటిల్

స్మితా పాటిల్


రెండు సార్లు నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులు, ఓ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు, పద్మశ్రీ అవార్డు పొందిన బాలీవుడ్ నటి స్మితాపాటిల్‌ వెండితెరపై, బుల్లితెరపై తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. నాటకరంగంలోనూ తన ప్రతిభను చాటుకున్నారు. అప్పట్లో ఆమె అత్యుత్తమ రంగస్థల, వెండితెర నటిగా పేరొందారు. రాజ్‌బబ్బార్‌తో ఆమె రొమాన్స్‌ పలువురి విమర్శలకు గురైంది. ఆమెను వివాహం చేసుకునేందుకు రాజ్‌బబ్బార్‌ తన భార్య నాదిరా బబ్బార్‌కు విడాకులిచ్చారు. 31 ఏళ్ళ వయస్సులో కుమారుడు ప్రతీక్‌ బబ్బార్‌ జన్మనిచ్చిన రెండు వారాల్లోనే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. నిర్లక్ష్య వైద్యం వల్లనే ఆమె మరణించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.

మధుబాల

మధుబాల


భారతీయ సినిమా రంగంలో ప్రముఖ తారగా చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో అలనాటి బాలీవుడ్ తార మధుబాల ఒకరు. 36వ ఏట ఆమె అనుమానాస్పదంగా మరణించారు.

పర్వీన్ బాబి

పర్వీన్ బాబి

సినిమా తారల్లో అత్యంత విషాదాత్మక మరణాల్లో బాలీవుడ్ నటి పర్వీన్ బాబి మరణం ఒకటి. 55 ఏళ్ల వయసులో ఆమె ముంబైలోని తన జుహు అపార్టుమెంటులో మణించారు. ఆమె మరణించిన 3 రోజుల తర్వాత పోలీసులు ఆమె మృత దేహాన్ని కనుగొన్నారు.

జియా ఖాన్

జియా ఖాన్

బాలీవుడ్ మిస్టరీ మరణాల్లో ఇటీవల మరణించిన నటి జియా ఖాన్ మరణం ఒకటి. ప్రియుడు సూరజ్‌తో ప్రేమ వ్యవహారమే ఆమె మరణానికి కారణమనే వివాదం నడుస్తోంది. ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకుని మరణించింది. అయితే తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను చంపారని, అందుకు తగిన సాక్షాలు ఉన్నాయని జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ వాదిస్తోంది.

మేర్లిన్ మన్రో

మేర్లిన్ మన్రో

సుప్రసిద్ధ హాలీవుడ్‌ తార, ఆనాటి యువ హృదయాల స్వప్నసుం దరి మేర్లిన్‌ మన్రో ఆత్మహత్య చేసుకుందన్న వార్త విని, ప్రపంచం లోని వివిధ ప్రాంతాల్లోని ఆమె అభిమానులు ఇరవైమందికి పైగా ఆ 'షాక్‌'కు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతకీ అది - ఆత్మహత్య కాదనీ, హత్యకు గురైందనీ ఇప్పటికీ వాదించేవారు న్నారు. కెన్నెడీ కుటుంబంతో ఆమెకున్న సన్నిహిత సంబంధాలే ఆమె అలా అన్యాయంగా చనిపోవడానికి దోహదపడ్డాయనీ, లోతు గా పరిశీలిస్తే ఎన్నో రహస్యాలు బయటపడతాయనీ అంటారు. కానీ ఆమె మరణ రహస్యం కొన్ని దశాబ్దాలైనా ఇప్పటికీ 'మిస్టరీ'గానే మిగిలిపోయింది.

శోభ

శోభ

'తరంమారింది', 'మనవూరి పాండవులు' మొదలైన చిత్రా లలో నటించి, 'పసి' అనే తమిళ చిత్రంలోని నటనకు ఉత్తమనటిగా జాతీయ బహుమతిని గెల్చుకున్న మలయాళ నటి శోభ కూడా ఆత్మహత్య చేసుకునే మరణించింది. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని ప్రముఖ మలయాళ దర్శకుడు కె.జి.జార్జ్‌ 'లేఖాయుడె మరణం ఒరు ఫ్లాష్‌బ్యాక్‌' అనే వివాదాస్పద చిత్రం రూపొందిం చారు. ఆమె జీవితంలో ప్రధాన పాత్ర నిర్వహించిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు బాలు మహేంద్రకు ఆమె మరణం వెనకగల కారణం ఏమిటో తెలియదట.

భార్గవి

భార్గవి

మంచి భవిష్యత్తు ఉందని అందరూ భావించిన నటి భార్గవి జీవితం కూడా అర్ధాంతరంగా ముగిసింది. 'అష్టాచెమ్మా' చిత్రం లో రెండవ నాయికగా నటించిన భార్గవి (వయసు 22) 2008లో డిసెంబర్‌ 16న హత్యకు గురైంది. ఆమెతో సన్నిహిత సంబంధాలు గల 'ప్రియుడే' ఆమెను హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకోవడం చిత్రరంగంలో కలవరాన్ని రేకెత్తించింది.

గురుదత్

గురుదత్

బాలీవుడ్ సినీ దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞను కనబర్చిన గురుదత్‌ అసలు పేరు వసంత్‌కుమార్‌ శివ శంకర్‌ పదుకొనె. ప్యాసా, కాగజ్‌ కే ఫూల్‌, సాహిబ్‌ బీబీ అవుర్‌ గులామ్‌, చౌద్విన్‌ కా చాంద్‌, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55 లాంటి చిత్రాలను పేరు ప్రఖ్యా తులు తెచ్చాయి. గాయని గీతా దత్‌తో ఆయన వివాహం భగ్నమైపోయింది. ముంబయిలోని ఆయన అపార్ట్‌మెంట్‌లో ఆయన అనుమానాస్పదంగా మృతి చెందారు.

English summary

 Film industry is filled with mysteries. There are many celebrity stories that have been under the wraps since years. From secret weddings to deaths, the lives of many celebrities is a hush-hush affair. It is not that Hollywood celebrities only have mysterious deaths.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu