For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగా మేనల్లుడిపై జాలి పడుతున్నారు!

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అవుతున్న సాయి ధరమ్ తేజ్ కు ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో ఏ హీరో కూడా పడనన్నికస్టాలు పడుతున్నాడు. ఆయన నటించిన తొలి చిత్రం 'రేయ్' సంవత్సరాలు గడుస్తున్నా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. 2010లో ప్రారంభమైన ఈ చిత్రం అష్టకష్టాలు పడి 2013 నాటికి పూర్తయినా.....విడుదల విషయంలో కూడా తీవ్రమైన జాప్యం జరుగుతోంది. మెగా ఫ్యామిలీ హీరో పరిస్థితి ఇలా ఉంటే...ఇతర సాధారణ హీరోల పరిస్థితి ఏమిటనే చర్చ సాగుతోంది.

  ప్రతీసారీ ఏదో ఒక కారణం చెప్పి సినిమా రిలీజ్ ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు దర్శకుడు వైవియస్ చౌదరి. ఆ మధ్య ఎట్టిపరిస్ధితుల్లోనూ మే 9 న విడుదల చేద్దామని నిర్ణయించుకున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. ఆ తేదీ దాటి ఐదు నెలలు దాటినా సినిమా కనీసం విడుదలకు నోచు కోవడం లేదు. కనీసం ఎప్పుడు విడుదలవుతుందనే స్పష్టత కూడా ఇప్పటి వరకు రాలేదు. అసలు 'రేయ్' సినిమా వార్తల్లోనే లేదు.

  Mystery behind Sai Dharam Tej's 'Rey' delay

  అయితే మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా సినిమా గురించి గొప్పగా చెబుతు అభిమానుల్లో ఆశలు రేపుతున్నాడు వైవిఎస్ చౌదరి. ఆ మధ్య ఆయన మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది. ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తొలి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది అన్నారు.

  అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్‌లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ కన్నా ఈ మేనల్లుడిలోనే చిరు పోలికలు బాగా ఉన్నాయి చిరంజీవి నట వారసత్వాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోగల సత్తా సాయి ధరమ్ తేజకే ఉన్నాయనిపిస్తోందన్న వాదనలను కూడా తెరపైకి తెచ్చారు. అయితే సినిమా మాత్రం విడుదల కావడం లేదు.

  English summary
  Mystery behind Sai Dharam Tej's 'Rey' delay. Rey is an upcoming Telugu Musical film directed and produced by YVS Chowdary on his Bommarillu films banner. The film marks the debut of Sai Dharam Tej and Saiyami Kher while Shraddha Das & Farhad Shahnawaz played an equally important role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X