»   »  షాక్ : భారీ కష్టాల్లో పవన్ కళ్యాణ్.. మైత్రి మూవీస్ నోటీసులు!

షాక్ : భారీ కష్టాల్లో పవన్ కళ్యాణ్.. మైత్రి మూవీస్ నోటీసులు!

Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కష్టాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే రాజకీయాలకోసం సినిమాలు వదిలేసిన పవన్ కళ్యాణ్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పవన్ కళ్యాణ్ కు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ లీగల్ నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవాకు వాస్తవం ఉందొ తెలియదు కానీ పవన్ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఆందోళన చెందుతున్నారు.

Pawan Kalyan In Dilemma About Movies
 కోట్లల్లో అడ్వాన్స్ తీసుకున్న పవర్ స్టార్

కోట్లల్లో అడ్వాన్స్ తీసుకున్న పవర్ స్టార్

మైత్రి మూవీస్ బ్యానర్ పై రెండు చిత్రాలు చేయడానికి అంగీకరించిన పవన్ కోట్లల్లో నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకున్నాడనే వార్తలు ఎప్పటినుంచో వస్తున్నాయి. దాదాపు 20 కోట్లు అడ్వాన్స్ రూపంలోనే పవన్ తీసుకున్నాడట. ఈ ఒప్పందం ప్రకారం పవన్ వారికీ రెండు సినిమాలు చేసిపెట్టాలి.

రెడీగా ఉన్న సంతోష్ శ్రీనివాస్

రెడీగా ఉన్న సంతోష్ శ్రీనివాస్

కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ మైత్రి మూవీస్ నిర్మాణంలో రూపు దిదుకోబోయే పవన్ చిత్రానికి దర్శకుడంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇప్పటికే సంతోష్ శ్రీనివాస్ పవన్ కోసం ఓ తమిళ కథలో మార్పులు చేసుకుని రెడీగా ఉంచుకున్నాడని ప్రచారం జరిగింది.

 ఎందుకు మొదలు కాలేదు

ఎందుకు మొదలు కాలేదు

పవన్ కళ్యాణ్ తానూ ముందుగా కమిటై ఉన్న సినిమాలు పూర్తి చేసే లోపలే ఎన్నికల ఏడాది కూడా వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా. కాబట్టి ఇక ఆలస్యం చేస్తే పార్టీకి భవిష్యత్తు అందదని భావించిన పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసాడు. దీనితో పవన్ తో సినిమా నిర్మించాలనుకున్న మైత్రి మూవీస్ వారి కోరిక కలగానే ఉండిపోయింది.

 క్యూలో మరో నిర్మాత కూడా

క్యూలో మరో నిర్మాత కూడా

పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలా మంది నిర్మాతలు క్యూలో ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ మాత్రమే కాదు.. పవన్ కళ్యాణ్ తో ఖుషి వంటి ఇండస్ట్రీ హిట్ సినిమా రూపొందించిన ఏఎం రత్నం కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూపులు చూస్తున్నాడు. రత్నం నిర్మాణంలో ఆర్టీ నేసన్ దర్శత్వంలో ఓ చిత్రం ప్రారంభం అయింది కూడా. అది పూజా కార్యక్రమాలతోనే ఆగిపోయింది.

 కల నెరవేరకుండానే దాసరి

కల నెరవేరకుండానే దాసరి

పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలని కలగన్న వారిలో దిగ్గజ దర్శకులు స్వర్గీయ దాసరి నారాయణ రావు కూడా ఉన్నారు. పవన్ తో సినిమా నిర్మించబోతున్నానంటూ అధికారికంగా ప్రటించారు కూడా. కానీ అది కార్యరూపం దాల్చే సమయానికి ఆయన కన్ను మూశారు.

 పవన్ కు లీగల్ నోటీసులు

పవన్ కు లీగల్ నోటీసులు

అడ్వాన్స్ తీసుకుని కాలయాపన చేస్తున్న పవన్ కళ్యాణ్ పై మైత్రి నిర్మాతలు ఆగ్రహంతో ఉన్నారట. పవన్ ని చట్టపరంగా ఎదుర్కొనాలని నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా ఇందులో వాస్తవం ఎంత అనే విషయాలపై క్లారిటీ రావలసి ఉంది.

English summary
Mythri movie makers sends legal notice to PawanKalyan. Pawan Kalyan takes advance from producers but he will not redy to do movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu