»   » యు.ఎస్‌.లో ఎన్.శంక‌ర్ స్టార్ హంట్‌

యు.ఎస్‌.లో ఎన్.శంక‌ర్ స్టార్ హంట్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్‌కౌంట‌ర్‌, శ్రీరాముల‌య్య‌, జ‌యం మ‌న‌దేరా, భద్రాచ‌లం, జై బోలో తెలంగాణ వంటి చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న ఎన్‌.శంక‌ర్ సునీల్ హీరోగా మ‌ల‌యాళ చిత్రం టు కంట్రీస్‌ను రీమేక్ చేస్తున్నారు.

ఎన్‌.శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంతో పాటు ఈ చిత్రానికి నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాలో ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీక‌ర‌ణ చేస్తారు. అందుక‌ని అమెరికాలోని తెలుగు అమెరిక‌న్స్ ఉంటే బావుంటుంద‌ని, వారి కోసం ఎన్‌.శంక‌ర్ ఆలోచించి యు.ఎస్‌లో స్టార్ హంట్‌ను నిర్వ‌హిస్తున్నారు.

N Shankar Star Hunt In USA

ఈ సంద‌ర్భంగా...ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ - మ‌హాల‌క్ష్మిఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం..2గా రూపొందుతోన్న చిత్రంలో కొంత మంది కొత్త న‌టీన‌టులకు ప‌నిచేసే అవ‌కాశాన్ని క‌ల్పించాల‌నుకుని ఆర్లాండ్‌, న్యూయార్క్ న‌గరాల్లో ఆడిష‌న్‌ను నిర్వ‌హిస్తున్నాను. ఆస‌క్తి ఉన్న‌వారు వారి ప్రొఫైల్‌తో నన్ను ప‌ర్స‌న‌ల్‌గా క‌లుసుకోవ‌చ్చు. 20-60 సంవ‌త్స‌రాల వ‌య‌సుండి, ఎన్నారైలు, అమెరికాలో ఉండే స్త్రీ, పురుషులెవ‌రైనా ఈ స్టార్ హంట్‌లో పాల్గొన‌వ‌చ్చు అన్నారు.

వేదికః
ఆర్లాండ్‌లో డిసెంబ‌ర్ 10 వ తేది ఉద‌యం ప‌ది గంట‌లు నుండి, డిసెంబ‌ర్ 14న న్యూయార్క్‌లో స్టార్ హంట్‌కు హాజ‌రు కావ‌చ్చు.
పోర్ట్ ఫోలియో పంపాల్సిన ఈ-మెయిల్ః starhunt.nshankar@gmail.com

English summary
Popular film maker N Shankar known for directing memorable hits like Encounter, Sri Ramulayya, Jayam Manadera, Bhadrachalam and Jai Bolo Telangana is on a star hunt in USA. He is currently directing and producing new movie 2 Countries remake with Sunil. Major shooting of this project will be done in the USA. He is looking for native Telugu Americans to join the film and is conducting a Star Hunt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu