»   » బన్నీ సినిమాపై రూ. 10 కోట్లు పెట్టిన టీవీ ఛానల్!

బన్నీ సినిమాపై రూ. 10 కోట్లు పెట్టిన టీవీ ఛానల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' మూవీకి రిలీజ్ ముందే బిజినెస్ భారీగా జరుగుతోంది. సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలుకాక ముందే శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లు సమాచారం.

శాటిలైట్ రైట్స్ విషయంలో టీవీ ఛానల్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో 'జీ తెలుగు' ఛానెల్ వారు ముందే రంగంలోకి దిగి ఈ సినిమా శాటిలైట్ హక్కులను రూ. 10 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.


షూటింగ్ విశేషాలు

షూటింగ్ విశేషాలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అను ఇమాన్యుయెల్ హీరోయిన్‌గా వక్కంతం వంశి ద‌ర్శ‌క‌త్వం లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" మెద‌టి షెడ్యూల్ పూర్త‌య్యింది. రెండ‌వ షెడ్యూల్‌ని ఈ నెల 18 నుండి స‌సెప్టెంబ‌ర్ 2 వరకూ జ‌రుపుకుంటుంది.


Allu Arjun's Next Movie Naa Peru Surya Naa Illu India Launched
అర్జున్, శరత్ కుమార్

అర్జున్, శరత్ కుమార్

ఈ చిత్రంలో సినీయర్ నటుడు అర్జున్ కీలకమైన పాత్రలో, శరత్ కుమార్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. మెగా బ్రదర్ కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


2018 రిలీజ్

2018 రిలీజ్

బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2018, ఏప్రిల్ 27 న విడుద‌ల చేయ‌టానికి సన్నాహ‌లు చేస్తున్నారు.


నటీనటులు

నటీనటులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమాన్యుయెల్ , యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), ఫైట్స్ - రామ్ లక్ష్మణ్, సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి, సంగీతం - విశాల్ - శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు, బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్, సమర్పణ - కె.నాగబాబు, సహ నిర్మాత - బన్నీ వాసు, నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి, రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ.English summary
Film Nagar source said that, 'Naa Peru Surya Naa Illu India’s' satellite rights bagged by Zee Network for 10 Cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu