twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కలను నిజం అనుకుంటూ సిద్దార్థ్ ‘నాలో ఒకడు’(ఫోటోస్)

    By Bojja Kumar
    |

    కలలో జరిగిందే నిజం అనుకునే వ్యక్తి చుట్టూ తిరిగే కథాంశమే ‘నాలో ఒకడు'. ప్రసాద్ రమర్ దర్శకత్వంలో సిద్ధార్ధ్ , దీపసన్నిధి జంటగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఎనకుల్ ఒరువన్' చిత్రాన్ని కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన ‘నాలో ఒకడు'గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో విడుదలై అన్ని చోట్లా మంచి టాక్ తెచ్చుకుంది. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ మూడో వారంలో తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా మంగళవారం సాయంత్రం(ఏప్రిల్ 14) హైదరాబాద్ లో ఆడియో విడుదల చేసారు.

    ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ...‘తెలుగు ప్రేక్షకుల వల్లే నేను ఇపుడు ఈ స్థాయిలో ఉన్నాను. నాకు హీరోగా ఇమేజ్ ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది తెలుగు వారే. అందుకే నేను ఎక్కడికెళ్లినా తెలుగు హీరోననే చెప్పుకుంటాను. ‘నాలో ఒకడు' నేను చాలా కష్టపడి, ఆశపడి చేసిన సినిమా. ఊరి నుండి వచ్చిన కుర్రాడు తను కలలో ఎలా ఉండాలనుకుంటాడో అలాంటి సినిమా. కన్నడలో సినిమా చూసి నేను చేద్దామని వెళ్లి అడిగితే ఎవరో కొనేసారని చెప్పారు. నేను వెళ్లి వాళ్లని ఈ సినిమాని నేను చేస్తానని ఆల్ మోస్ట్ బెగ్గింగ్ టైపులో అడిగితే ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. లవర్ బాయ్ గా కాకుండా నటుడిగా వచ్చిన సినిమా ఇది. నార్మల్ బోయ్ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డాను. సంతోష్ నారాయణ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది అన్నారు.

    స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..

    దర్శకుడు మాట్లాడుతూ..

    దర్శకుడు మాట్లాడుతూ..


    దర్శకుడు ప్రసాద్ రమర్ మాట్లాడుతూ...తెలుగులో నా తొలి సినిమాగా ఈ చిత్రం విడుదల కావడం ఆనందంగా ఉంది. దర్శకుడుగా నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రం అవుతుంది' అన్నారు.

    మంచు లక్ష్మి మాట్లాడుతూ..

    మంచు లక్ష్మి మాట్లాడుతూ..


    మంచు లక్ష్మి మాట్లాడుతూ ఈచిత్రం తమిళంలో కంటే తెలుగులో చాలా పెద్ద హిట్ కావాలి అన్నారు.

    రానా మాట్లాడుతూ...

    రానా మాట్లాడుతూ...


    బాయ్స్ చిత్రంలో ఉన్నట్లుగానే సిద్ధార్థ్ ఇంకా యంగ్ గానే కనబడుతున్నాడు. లూసి అనే కన్నడ పాథ్ బ్రేకింగ్ సినిమాని ఎంచుకుని చేసిన సినిమా ఇది. తను మల్టీటాలెంట్ పర్సన్. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను అన్నారు.

    సందీప్ కిషన్ మాట్లాడుతూ..

    సందీప్ కిషన్ మాట్లాడుతూ..


    కమర్షియల్ గా, కంఫర్టబుల్ గా సినిమాలు చేస్తున్నాడు. తను చేసిన 25వ సినిమా ఇది. ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ అన్నారు.

    సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ మాట్లాడుతూ..

    సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ మాట్లాడుతూ..


    అద్వైతం అనే తెలుగు సినిమాకి సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాను. కన్నడలో రూపొందిన లూసియా తమిళంలో పెద్ద సక్సెస్ అయింది. తెలుగులో కూడా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు.

    English summary
    Naalo Okadu Movie Audio Launch event held at Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X