»   » చిలిపి: రామ్ చరణ్ గురించి నదియా ఆసక్తికర వ్యాఖ్యలు

చిలిపి: రామ్ చరణ్ గురించి నదియా ఆసక్తికర వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అత్తారింటికి దారేది, మిర్చి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నదియా. తాజాగా ఆమె రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రూస్ లీ' చిత్రంలో కూడా నదియా కీలకమైన పాత్రలో నటిస్తోంది. శుక్రవారం బ్రూస్ లీ ఆడియో రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్ గురించి నదియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

రామ్ చరణ్ గురించి నదియా మాట్లాడుతూ... సినిమా షూటింగ్ ప్రారంభం రోజు చరణ్‌తో పెద్దగా మాట్లాడలేదు. రిజర్వుడ్ అనుకున్నాను. కానీ షూటింగ్ కొనసాగుతున్న కాలంలో చరణ్‌లోని చిలిపి యాంగిల్ బయటపడింది. అప్పుడు తెలిసింది చరణ్ అల్లరి పిల్లాడని' అని నదియా చెప్పుకొచ్చారు.

Nadia comments about Ram Charan

ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగా హీరో రాంచరణ్ నటించిన బ్రూస్‌లీ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు తమన్. బ్రూస్‌లీ చిత్ర ఆడియోను మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. తొలి ఆడియో సీడీని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాంచరణ్ సతీమణి ఉపాసన, అరుణ్ విజయ్, గోపీమోహన్, కృతికర్భందా, కోన వెంకట్, ఎన్వీ ప్రసాద్, ముఖేశ్‌రుషి, నదియా, రకుల్‌ప్రీత్ సింగ్, జెమిని కిరణ్, కేఎల్ నారాయణ, సాయి ధరమ్‌తేజ్, టిస్కాచోప్రా, సంపత్‌రాజ్, రామజోగయ్యశాస్త్రి, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Check out Nadia comments about Ram Charan at Bruce Lee The Fighter music launch.
Please Wait while comments are loading...