»   »  నాగ్... ఇక కింగ్

నాగ్... ఇక కింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
పవర్ కింగ్ చిత్రాలలో ఏది ముందు నాగార్జున ప్రారంభస్తారు అన్న అభిమానుల సందేహాలకు ఇక తెరపడినట్లే. ఈ నెల 30 'కింగ్' చిత్రం ప్రారంభం కానుంది. నవ్య ధోరణిలో ముందుకు వెళ్ళే నాగార్జునకు 'శ్రీరామదాసు' విజయం తరువాత చెప్పుకోవటానికి పెద్ద హిట్టులు కరువయ్యాయి. ఎంతో హైప్ తో రిలీజయ్యిన 'డాన్' కూడా డ్రాప్ అవటంతో ఆయన వ్యూహం మార్చుకున్నట్లు కనపడుతున్నారు. తాజాగా 'ఢీ' తో హిట్ లిస్ట్ లో చేరిన శ్రీను వైట్ల సినిమా చెయ్యటానికి కమిటయ్యారు. దాంట్లో ఆయన కింగ్ గా కామిడి చేస్తాడంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఇందులో నాగార్జున లైటర్ వీన్ కామిడి ని పండిస్తూ కొత్త గెటప్ లో కనువిందు చేస్తాడట. విజయవంతమైన చిత్రాలు నిర్మించిన డి.శివ ప్రసాదరెడ్డి కామాక్షీ కళా మూవీస్ బానర్‌ పై ఈ చిత్రాన్ని నిర్మిచనున్నారు. గతంలో నాగార్జున నటించిన 'మన్మధుడు", 'మాస్" చిత్రాలకు సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికీ సంగీతం అందిస్తున్నారు. త్రిష కింగ్ కి జోడిగా చేస్తోంది. కథ శ్రీను వైట్ల స్టైల్‌లో నాగార్జున ఇమేజ్‌కు తగ్గ విధంగా ఉంటుందిట. ఈ సినిమా దసరా కి రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X