ప్రెసిడెంట్ పోస్ట్ రిజెక్ట్ చేసిన నాగార్జున?

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున తనను వెతుక్కుంటూ ప్రెసిడెంట్ పోస్ట్ ఆఫర్ వస్తే వద్దన్నాడా? ప్రెసిడెంట్ గిరీ చేయడం నా వల్ల కాదని తెగేసి చెప్పాడా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజ జీవితంలో మాత్రం కాదు.. ఓ సినిమాకు సంబంధించి మాత్రమే.

బాలీవుడ్ మూవీ 'లాహోర్' మూవీ ఫేం దర్శకుడు సంజయ్ పురాన్ సింగ్ నాగార్జునను సంప్రదించారని, తన తీస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ చిత్రంలో ప్రెసిడెంట్ రోల్ చేయాలని అడిగినట్లు ఓ ప్రముఖ పత్రికలో వార్తలు వచ్చాయి. 1974-1977 మధ్య కాలంలోని సమకాలిన రాజకీయాలపై ఈ చిత్రం ఉంటుందని, ఇండియా-పాకిస్థాన్ మధ్య సంబంధాల నేపథ్యంలో కథ సాగుతుందని, ఈ చిత్రంలో నాగార్జునకు అప్పటి ప్రెసిడెంట్ ఫక్రిద్దీన్ అలీ అహ్మద్ పాత్ర చేయాలని ఆఫర్ వచ్చినట్లు సదరు పత్రిక ప్రచురించింది. అయితే వివాదాలకు దూరంగా ఉండే నాగార్జున ఈ చిత్రంలో చేయడానికి విముఖత ప్రదర్శించారట.

ఇక నాగార్జున సినిమాల వివరాల్లోకి వెళితే...
నాగార్జున నటించిన డమరుకం చిత్రం ఈనెల 10న విడుదల కావాల్సి ఉండగా ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడింది. ఈ నెల 23న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జున దశరథ్ దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చిత్రం చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న 'లవ్ స్టోరీ'లో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు. అనీల్ బండారి ఈ చిత్రానికి కెమెరా మెన్ గా చేస్తున్నారు. కామాక్షి మూవీ బ్యానర్ పై చందన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X