»   » దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఎవరు? నాగబాబు ఆసక్తికర కామెంట్

దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఎవరు? నాగబాబు ఆసక్తికర కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇంతకాలం సినిమా పరిశ్రమకు సంబంధించి ఏ సమస్య వచ్చినా, ఏదైనా వివాదం ఏర్పడినా అందరూ..... ఈ సమస్యకు పరిష్కారం చెప్పగల సమర్థుడు గురువుగారు మాత్రమే అంటూ దాసరి నారాయణరావు ఇంటి వైపు నడిచారు. ఎన్నో ఏళ్లుగా దాసరి నారాయణరావే ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా కొనసాగుతూ వచ్చారు.

అయితే దాసరి మరణం తెలుగు సినీ పరిశ్రమను ఒక్కసారిగా కుదిపేసింది. రేపు ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా వివాదం ఏర్పడిన దగ్గరుండి అందరికీ న్యాయం జరిగేలా పరిష్కరించగలిగే పెద్ద ఎవరు? అనే ప్రశ్న తలెత్తింది.

ఈ పరిణామాల నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర కామెంట్ చేసారు.

నాగబాబు ఏమన్నారంటే...

నాగబాబు ఏమన్నారంటే...

దాసరిగారు ఉన్నంత వరకు ఏ లోటు తెలియనివ్వలేదు. తన సహాయం కోరి ఇండస్ట్రీ నుండి ఎరువ వచ్చినా న్యాయం చేసేవారు. ఎన్నో వివాదాలు దాసరిగారు చాకచక్యంగా పరిష్కరించారు అని నాగ బాబు తెలిపారు.

దాసరి లేని లోటు తీర్చేది ఆయనే

దాసరి లేని లోటు తీర్చేది ఆయనే

దాసరి నారాయణరావు మృతితో ఏర్పడిన లోటు ఎవరూ తీర్చలేనిదని, అయినప్పటికీ, చిత్ర పరిశ్రమలో వచ్చే సమస్యలను భుజాన వేసుకుని వాటిని పరిష్కరించేందుకు మోహన్ బాబు వంటి పెద్దలు ఉన్నారని చిరంజీవి సోదరుడు నాగబాబు వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.

సొంత పనులు మానుకుని

సొంత పనులు మానుకుని

ఇంతకాలం ఇండస్ట్రీలో మాకు ఏ విధమైన సమస్య వచ్చినా దాసరి గారికి ఒక్క మాట చెబితే చాలు... ఆయన సొంత పనులు కూడా మానుకుని మా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసే గొప్ప మనసు దాసరి గారిది అని నాగబాబు అన్నారు.

నేనెప్పుడూ వెళ్లలేదు కానీ...

నేనెప్పుడూ వెళ్లలేదు కానీ...

నాకు వ్యక్తిగతంగా నేను నా సమస్యలతో ఆయన వద్దకు వెళ్లలేదు గానీ, చాలా మంది నావంటి వారు పరిష్కరించలేని సమస్యలను ఆయన అవలీలగా సాల్వ్ చేసి ఎంతో మందికి సాయపడ్డారు అని నాగబాబు దాసరి గురించి వ్యాఖ్యానించారు.

అన్నయ్య అందుకే రాలేదు

అన్నయ్య అందుకే రాలేదు

అన్నయ్య చిరంజీవి మంగళవారం సాయంత్రమే చైనా వెళ్లారు. ఆయన ట్రాన్సిస్ట్ లో ఉండగా ఈ విషయం తెలిసింది. ఆయన అటు వెళ్లలేక, ఇటు రాలేక చాలా బాధ పడ్డారు. చరణ్ బాబు కూడా ఊర్లో లేడని నాగబాబు అన్నారు.

సినిమా రంగానికే తన జీవితం అంకితం

సినిమా రంగానికే తన జీవితం అంకితం

దాసరి ఉన్నంత వరకు 24 క్రాఫ్ట్స్ లో ఉన్న నాయకులకు తల్లో నాలికలా వ్యవహరించేవారు. సినిమా డైరెక్షన్ మానేసిన తర్వాత కూడా ఆయన జీవితం 24 క్రాఫ్ట్స్ కోసం అంకితం చేసారు, దాసరిలా సేవ చేసే వారు ఇండస్ట్రీకి మళ్లీ దొరకరు అన్నారు.

అంతలోనే ఇంత పెద్ద విషాదం

అంతలోనే ఇంత పెద్ద విషాదం

దాసరి గారు ఆసుపత్రి నుండి కోలుకుని బయటకు వస్తే కలుద్దామనుకున్నాను. ఈ విధమైన పరిస్థితి చూస్తానని అనుకోలేదు. చాలా పెయిన్ ఫుల్ గా ఉంది అని నాగబాబు అన్నారు.

English summary
Naga Babu Reveals Reasons for Chiranjeevi and Ram Charan's Absence at Dasari Narayana Rao's Death Funeral.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu