»   » జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ టీం ఔట్ :కోపంతో అరిచేసిన నాగబాబు (వీడియో)

జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ టీం ఔట్ :కోపంతో అరిచేసిన నాగబాబు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

జబర్దస్త్ షోతో క్రేజ్ సంపాదించిన వీరిద్దరు బయట కూడా మంచి స్నేహితులుగా ఉంటున్నారు. ఇక అదే కాకుండా మిగతా షోలతో కూడా వీరు మంచి పాపులారిటీ సంపాదించారు. జబర్దస్త్ కామెడీ షోలో సుడిగాలి సుధీర్ టీం ఓ స్టార్ టీంగా అయ్యింది.. మంచి రేటింగ్ వచ్చే జబర్దస్త్ స్కిట్లలో సుడిగాలి సుధీర్ టేమ్ కూడా ఒకటి. నాగబాబుని "ఐ లవ్యూడాడీ అంటూ పిలిచే సుధీర్ స్కిట్లు ఇక కనిపించవా..?? నాగబాబు జబర్దస్త్ షో నుంచి ఈ టీమ్ ని తప్పించాడా?? మ్మార్చి 31 న ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కు సంబంధించిన ప్రోమో ను చూస్తే ఈ విషయం అర్థమవుతోంది..

తోపులనుకుంటున్నారా?

తోపులనుకుంటున్నారా?

సుడిగాలి సుధీర్ స్కిట్ తో ఉన్న ఈ ప్రోమో లో సుధీర్ స్కిట్ తర్వాత యాంకర్ రేష్మీ.. "స్కిట్ ఓవర్.. అసలేంటి... మీరు పెద్ద తోపులనుకుంటున్నారా?" అని అనడం...వెంటనే గెటప్ శ్రీను.. స్కిట్ సూపరమ్మా.. ప్రతి సారి ఇది చేయకు నువ్వు.. అడుగు అంటూ శీను అనడంతో వాతావరణం సీరియస్ అయ్యింది.

నాగబాబు కూడా

నాగబాబు కూడా

వెంటనే జడ్జ్ నాగబాబు కూడా..." ప్రాబ్లం ఏంటి మీకు? మీకు పొగరు, అహంకారం, ఇగో తెగ వచ్చేసినయ్...." అని అనడం.. వెంటనే రోజా మైకందుకొని..."మీకు స్టోరీగాని.. కొత్త కాన్సెప్ట్ గాని ఏం దొరకవా... ఎంతసేపు...ఆయన లవ్ లెటర్ ఇవ్వడం... కూతురుకు ఇవ్వడం.. అమ్మకు ఇవ్వడం..."... అంటూ రోజా అనడంతో... వెంటనే గెటప్ శీను... రోజాను ఉద్దేశించి..."మీరు చెప్పండి మేడం..ఎలా చేయాలో అనడం", ఎలా చేయాలో మీకు తెలియదా అంటూ నాగబాబు ఆగ్రహానికి గురయ్యాడు.

రోజా కూడా

రోజా కూడా

సరె చెక్కు ఇవ్వు.. నీకు ఇచ్చిన చెక్కు నాకివ్వు నేను చెబుతా అంటూ రోజా కూడా ఆగ్రహానికి గురవ్వడం... ఇలాంటి స్కిట్లు కూడా చేస్తారా ఎవరన్నా.. ఇదో స్కిటా అసలు అంటూ నాగబాబు అనడం.. వెంటనే సుధీర్ చేస్తే తెలుస్తుంది సార్ అనడం.. నాగబాబుకు ఆగ్రహాన్ని గురిచేసింది.

ఫస్ట్ మీరు ఔట్ ఆఫ్ మై సైట్

ఫస్ట్ మీరు ఔట్ ఆఫ్ మై సైట్

వెంటనే చేయండి సార్ అంటూ శీను, రాంప్రసాద్ కూడా నాగబాబు ను అనడంతో... ఇష్యూ చేయాలనుకుంటున్నారా మీరు... ఫస్ట్ మీరు ఔట్ ఆఫ్ మై సైట్ అంటూ నాగబాబు సీరియస్ గా అనడంతో వెంటనే అక్కడ నుంచి సుధీర్ టీం బయటికి వెళ్లిపోయింది.

టీఆర్పీ కోసం

ప్రోమోలో అయితే ఇదే కనిపిస్తోంది. అయితే ఇదంతా సీరియస్ వ్యవహారమా లేదంటే... టీఆర్పీ కోసం ఈ వీడియోని కలిపేసారా అన్నదే కాస్త డౌట్.. గతం లో కూడా షకలక శంకర్ టీయక లో అప్పారావ్ కీ శంకర్ కీ ఇలాగే పెద్దగొడవ జరిగింది. దాన్ని స్కిట్లో భాగమే అన్నట్టు కనిపించేలా చేసి కవర్ చేసారు... మరి ఈసారి సంగతేమిటో చూడాలి...

English summary
Naga Babu And Roja Angry On Sudigali Sudheer Team At Extra Jabardasth.., and sai To leave the Jabardast stage
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu