Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మెగా ఫ్యాన్స్ వివాదలపై నాగబాబు ఫైర్.. నేను ఎంట్రీ ఇస్తే మాములుగా ఉండదు అంటూ..
మెగా బ్రదర్ నాగబాబు ఏది మాట్లాడినా కూడా సూటిగా మాట్లాడుతారు అని అందరికీ తెలిసిన విషయమే. తనవారైనా సరే ఆయన కౌంటర్ ఇచ్చి వారి తప్పులను సరిచేసేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే ఇటీవల కాలంలో మెగా ఫ్యాన్స్ మధ్యలో నెలకొన్న కొన్ని రాజకీయ వాతావరణాలపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని తప్పులు జరుగుతున్నాయని వాటిని సరిదిద్దుకుంటే బాగుంటుంది అని కూడా ఆయన సూటిగా చెబుతూ తనదైన శైలిలో ఒక వివరణ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఫ్యాన్స్ తో నాగబాబు
త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఫ్యాన్స్ అందరు కూడా ఆ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక మెగా అభిమానులతో ప్రత్యేకంగా చర్చలు జరిపిన నాగబాబు కొంతమంది మెగా లీడర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా జరుగుతున్న పొరపాట్ల పై కూడా ఆయన సూటిగా కొన్ని హెచ్చరికలు కూడా చేశారు.

ఫ్యాన్స్ తలచుకుంటే..
మెగా ఫాన్స్ యూనియన్ లీడర్స్ లలో అందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేస్తున్నారని ఫ్యాన్స్ తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు అని అయితే ఈ యూనిటీలో ఎంత బాగా కలిసి ఉంటే అంత బలం చేకూరుతుంది అని అన్నారు. కన్నడలో రాజ్ కుమార్ చాలా సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా ఆయన ఫ్యాన్స్ మాత్రం చాలా భయం తప్పించేలా ఉంటారు అని నాగబాబు తెలియజేశారు.

కొత్తవారికి అవకాశాలు
ఫ్యాన్స్ తలుచుకుంటే ఏదైనా సరే వండర్స్ చేయవచ్చు అని అలాగే ఏ సినిమా ఫ్లాప్ కాదు అని కూడా అన్నారు. అయితే కొన్ని యూనియన్లలో మాత్రం కొత్తవారికి అవకాశాలు రావడం లేదు అని అందరూ ఎదిగేలా చూడాలి అని అన్నారు. కొన్ని గొడవలు మా వరకు కూడా వస్తున్నాయని అలాంటి వాటిపై కూడా మేము కొన్నిసార్లు పోనీలే అని వదిలేస్తున్నట్లు తెలియజేశారు.

అప్పుడు మాములుగా ఉండదు
కానీ భవిష్యత్తులో మాత్రం ఇలాంటి పొరపాట్లు అసలు జరగకూడదు అని నాగబాబు వివరణ ఇస్తూ.. నేను అనుకుంటే యూనియన్ మొత్తం బాధ్యతలను తీసుకోగలనని అన్నారు. అప్పుడు మాత్రం పరిస్థితులు ఒకసారిగా మారిపోతాయి మామూలుగా ఉండదు అని అన్నారు. కొత్తవారిని కూడా రానివ్వండి అందరికీ అవకాశం కల్పించండి. లీడర్స్ అనే వారు అందరిని కలుపుకుంటూ వెళ్లిపోవాలి. కలిసికట్టుగా ఉంటేనే బలం చేకురుతుంది అని నాగబాబు వివరణ ఇచ్చారు.

మెగాస్టార్ ఇంకా కష్టపడుతున్నారు
ఇక రాజకీయాలు లాంటివి ఈ ఫ్యాన్స్ మధ్యలో ఉండకూడదు అని హ్యాపీగా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయండి అని నాగబాబు తెలియజేశారు. అంతేకాకుండా అవసరమైన వివాదాలకు వెళ్లకుండా కలిసికట్టుగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి అని ఇప్పుడు మెగాస్టార్ చాలా కష్టపడుతున్నారు అంటూ ఆయన ప్రతి సన్నివేశం లో నటించే ముందు గుర్తుపెట్టుకునేది ఒక్క అభిమానులను మాత్రమే అని నాగబాబు తెలియజేశారు.