»   » దడదడలాడించే కుర్రాడు ('దడ' ప్రివ్యూ)

దడదడలాడించే కుర్రాడు ('దడ' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య యాక్షన్ హీరోగా కనిపించబోయే 'దడ'చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది.చిత్రంలో నాగచైతన్య విశ్వగా కనిపిస్తాడు.కథ ప్రకారం విశ్వ (నాగచైతన్య) బుల్లెట్‌ లాంటి కుర్రాడు. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తుంటాడు. అక్కడ ఓ ముఠా ఆధిపత్యం చెలాయిస్తుంటుంది. విశ్వ దాన్ని అడ్డుకొంటాడు. విశ్వ దూకుడు నచ్చి ప్రియ (కాజల్‌) ప్రేమిస్తుంది. విశ్వ తన చదువు పూర్తి చేసుకొని ఇండియా తిరిగి రావాలనుకొంటాడు. చివరి పదకొండు రోజుల్లో అతనికి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అవేంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అనేవి తెర మీదే చూడాలి.ఇక ఈ చిత్రం గురించి నాగచైతన్య మాట్లాడుతూ ''కమర్షియల్ హంగులతో నిండిన ఓ ప్రేమకథ ఇది. యాక్షన్‌ అంశాలు ఎక్కువగా ఉంటాయి. నా మాట తీరు, పాత్ర చిత్రణ నాకే కొత్తగా అనిపించాయి. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం ఆకట్టుకొంటుంది. నాకైతే 'హలో... లైలా' పాట బాగా నచ్చిందన్నారు.

సంస్థ: శ్రీకామాక్షి ఎంటర్‌ప్రైజెస్‌
నటీనటులు: నాగచైతన్య, కాజల్‌, శ్రీరామ్‌, సమీక్ష, బ్రహ్మానందం, అలీ, రాహుల్‌దేవ్‌, ముఖేష్‌ రుషి, కెల్లీ డార్జ్‌, తనికెళ్ల భరణి, వేణుమాధవ్‌ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
నిర్మాత: డి.శివప్రసాద్‌రెడ్డి
దర్శకత్వం: అజయ్‌ భుయాన్‌
విడుదల: గురువారం.

English summary
Naga Chaitanya’s forthcoming film ‘Dhada’ is scheduled to release on Thursday, 11th of August. The film has recently undergone Censor and bagged U/A certificate.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu