Just In
- 37 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 3 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- News
యూపీలో ఆగని అత్యాచారాలు.. కాపాడాల్సిన పోలీసే కాటేశాడు.. మరో ఘటనలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం...
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాగ చైతన్య ‘దోచేయ్’ ఫస్ట్ లుక్ (ఫోటో)
హైదరాబాద్ : సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘దోచేయ్' అనే టైటిల్ పెడుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అదే టైటిల్ ఖరారు చేస్తూ ‘ఫస్ట్ లుక్' అఫీషియల్ గా విడుదల చేసారు. టైటిల్‍కు తగిన విధంగానే ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది.
ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. క్లైమాక్స్ , కొన్ని పాటలు షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. ఈ చిత్రం ఎప్పుడో ప్రారంభమైనా రీషూట్ లు చేసారని అందుకే లేటయ్యిందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. పూర్తైన రషెష్ చూసిన నాగార్జున, నాగ చైతన్య కొన్ని సూచనలు చేసారని, అందుకు తగినట్లు దర్శకుడు రీషూట్ లు చేసారని చెప్పుకుంటున్నారు. దాంతో అవుట్ ఫుట్ సంతృప్తికరంగా వచ్చి రిలీజ్ డేట్ ని నిర్ణయించారని తెలుస్తోంది.
ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సినిమాను మార్చి 20వ తేదిన విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. చైతన్య సరసన ‘1 నేనొక్కడినే' ఫేం కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ తరహా జోనర్ లో చైతన్య సినిమా చేయడం ఇదే తొలిసారి. వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నీ ఎంఆర్ సంగీత దర్శకుడు. త్వరలో ఆడియో విడుదల కానుంది.
''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే కథే మా చిత్రం అంటున్నారు సుధీర్ వర్మ. నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ-‘ అత్తారింటికి దారేది తర్వాత మా బ్యానర్‌లో స్వామిరారా టెక్నిషియన్స్‌తో చేస్తున్న సినిమా ఇది. నాగచైతన్య చాలా డెటికేటెడ్ ఆర్టిస్ట్. స్టైలిష్‌గా ఉండే కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. నాగచైతన్య మూవీలో బెస్ట్ మూవీ అవుతుంది. ఆడియన్స్‌తో పాటు ఫ్యాన్స్‌కి కూడా బాగా నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయన్నారు.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్., సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్., ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్., ఆర్ట్: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.